Boyapati Srinu: ‘స్కంద’లో బోలెడు లాజిక్‌లు మిస్‌… ఒకటో రెండో ఓకే మరీ ఇన్నా? ఎందుకని?

సినిమా అంటేనే కొన్ని సన్నివేశాలకు లాజిక్‌లు ఉండవు అని అంటుంటారు. అలా అని మొత్తంగా లాజిక్‌ లేకుండా చేస్తే దాన్ని సినిమా అనరు. ఏవో చిన్న చిన్న పాయింట్ల విషయంలో లాజిక్‌లు లేకపోతే ఓకే కానీ… మొత్తంగా లాజిక్‌లు లేకపోతే ఎలా? దాంతోపాటు కీలకమైన విషయాల్లో లాజిక్‌లు లేకపోతే ఇంకా కష్టం. ఏంటీ ‘లాజిక్‌ పురాణం’ అని అనుకుంటున్నారా? ఇటీవల వచ్చిన ఓ సినిమా గురించే ఇదంతా అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ సినిమానే ‘స్కంద’. రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఆ సినిమా గురించే ఈ ‘లాజిక్‌ పురాణం’. మామూలుగానే బోయపాటి సినిమాల్లో లాజిక్‌ అందని మ్యాజిక్‌లు చాలానే ఉంటాయి. మాస్‌ జనాలకు నచ్చేలా సినిమా చేస్తాను అని అంటూ ఎవరూ ఊహించని, ఎక్కడా జరగని, ఎన్నడూ చూడని సన్నివేశాలు సినిమాల్లో పెట్టేస్తుంటారాయన. తాజాగా ‘స్కంద’ సినిమాలోనూ అదే పని చేశారు. దీంతో మరోసారి ఆయన లాజిక్‌ల గురించి చర్చ మొదలైంది. సినిమా హిట్‌ అయ్యింది కదా ఇవన్నీ ఎందుకు అనేవాళ్లూ ఉన్నారనుకోండి.

బోయపాటి శ్రీను.. లాజిక్‌ రెండూ భిన్న ధృవాలు అని అంటుంటారు. ఆయన కథ, పాత్రలు, సన్నివేశాలు, పాత్రల బంధాలు, జనాలకు చెప్పే మాటలు – సీన్లు చాలానే ఉంటాయి. ‘లెజెండ్‌’ సినిమానే తీసుకోండి బాలకృష్ణను లండన్‌ పంపించి, దుబాయి నుండి తీసుకొస్తారు. ఇక తలను గద్దలు ఎగరేసుకుపోవడం ఇలా చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ పాతవి. మరి కొత్తగా ఏంటనేది చూస్తే… ‘స్కంద’లో సీఎంల సన్నివేశాలు అని చెప్పొచ్చు. వాటికితోడు కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

ట్రాక్టర్‌ను బైకుని రౌండ్ తిప్పినట్లు రౌండ్లు తిప్పడం సినిమాలో చూడొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని విలన్లు చేసి చూపించారు. హీరో వాళ్లతో ఓ ఆటాడుకోవడం చూపించారు. సెక్యూరిటీని ఆటాడించి సీఎం ఇళ్లలోకి ఓ కుర్రాడు వెళ్లడం ఎలా సాధ్యం. ఏకంగతా సీఎం భయపడి… నీకు కావాల్సింది తీసుకుపో అనడం, ఇద్దరు సీఎం కూతుళ్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం ఇలా చాలానే ఉన్నాయి. నిజ జీవితంలో చేయడం కష్టం అనుకునే సన్నివేశాలను సినిమాల్లో చూపిస్తే ఓకే.

కానీ మరీ ఇంత లిబర్టీ ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న. ఓ సీన్లోనే గవర్నర్ వచ్చి ఒక సీఎంను, మరో రాష్ట్ర సీఎంకు పరిచయం చేస్తారు. ఇది నిజ జీవితంలో అసాధ్యం. ఒక రాష్ట్ర సీఎం, ఇంకొక రాష్ట్ర సీఎంకు తెలియదా అనేదే ప్రశ్న. ఇవన్నీ చూసి బోయపాటి (Boyapati Srinu) తెలిసే చేస్తున్నారా? లేక ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus