సాధారణంగా అందరి జీవితంలోనూ పెళ్లి అనేది ఓ మెమరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మూమెంట్.. దంపతుల మధ్య సఖ్యత కుదరకపోతే పరస్పర అంగీకారంతో విడిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అది వాళ్ల వాళ్ల మెంటాలిటీ, మెచ్యూరిటీ లెవల్‌ని బట్టి ఉంటుంది.. ఇదే సినిమా వాళ్ల విషయానికొస్తే మాత్రం, వాళ్ల జీవితాలను భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ఇటీవల సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్యర్య రజినీ కాంత్.. అల్లుడు ధనుష్ విడిపోతున్నారని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.
ఇన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లవుతుండగా.. ఇంతలో ఏమైందబ్బా? అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి కలిసిపోతున్నట్లు ప్రకటించారు. ఇక్కడితో కథ సుఖాంతమైంది.. ఇప్పుడీ ముచ్చట ఎందుకంటే.. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇలాగే తన భార్య లతకు విడాకులిద్దామనుకున్నారు. కొద్ది రోజులుగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు కూడా మీడియాతో చెప్పారు. వివరాళ్లోకి వెళ్తే.. 1985లో రజినీ కాంత్, భార్య లత కొద్దికాలంగా వేర్వేరుగా ఉంటున్నారని..
త్వరలో విడాకులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కొన్ని తమిళ పత్రికలు కథనాలు రాశాయి.. అప్పట్లో హరేకృష్ణ మూమెంట్‌లో చేరిన రజినీ పూర్తిగా దానికే అంకితమైపోవడంతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు వచ్చాయనేది ఆ వార్తల ఉద్దేశం.. ఇదే మాట రజినీని అడగ్గా.. ‘‘కొన్ని అభిప్రాయ భేదాల వల్ల.. నేను, నా భార్య లత వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాం.. అంతకుమించి మా మధ్య ఎలాంటి ద్వేష భావనా లేదు’’ అని చెప్పారు.. తర్వాత కొంతకాలానికి వారి మధ్య మనస్ఫర్థలు తొలగిపోయాయి..
అప్పుడు రజినీ ‘శ్రీ రాఘవేంద్రర్’ అనే తమిళ చిత్రంలో రాఘవేంద్ర స్వామి పాత్రలో నటిస్తున్నారు.. రజినీ కెరీర్‌లో 100వ సినిమా ఇది.. ఈ సమయంలోనే ఆయన కాస్త ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెట్టారని కూడా అంటుంటారు. స్వయంగా సూపర్ స్టారే భార్యతో విడిపోతున్నట్లు చెప్పడం అప్పట్లే పెద్ద సంచలనమే అయ్యింది..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!