నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి కొన్ని ఏరియాల్లో లాభాలను అందించింది.
అలాగే బాలకృష్ణ కెరీర్లో కూడా ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు కొట్టింది. అయితే రిలీజ్ కు ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కంటే ఈ మూవీపైనే అందరి ఫోకస్ ఉండేది. అయితే సినిమా అనుకున్న రేంజ్లో లేకపోవడంతో పోటీలో చిన్నదిగా కనిపించింది. బాలకృష్ణతో సినిమా అంటే గోపీచంద్ మలినేని… బోయపాటి రేంజ్లో తీస్తే సరిపోతుంది అనుకున్నాడు అనుకుంట. ఎక్కువ శాతం.. ఫైట్లు, డైలాగులు పెట్టేసి సెకండ్ హాఫ్ లో బలంగా పండాల్సిన సెంటిమెంట్ ను గాలికి వదిలేశాడు.
అంతేకాదు మంచి డైలాగుని కూడా రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టాడు అని కొందరు నెటిజన్లు, బాలయ్య అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. ‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదు అని నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత, నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్’…! వినడానికి ఈ డైలాగ్ చాలా బాగుంది. ట్రైలర్లో కూడా ఈ డైలాగ్ ను పెట్టారు. సినిమా పై హైప్ పెరగడానికి ఈ డైలాగ్ కూడా ఓ కారణం అని చెప్పాలి.
అయితే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలైనప్పుడు రావాల్సిన ఈ డైలాగ్ ను ఎక్కడో చివర్లో ఇరికించడం బాలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో విలన్ తండ్రితో ఫైట్ చేసే టైంలో పెద్ద బాలయ్య అలియాస్ ‘వీరసింహారెడ్డి’.. ‘రేపటి తరం కూడా నీ చావుని కోరుకుంటుంది’ అంటూ విలన్ కు తనను పరిచయం చేసుకుంటాడు. ఆ టైంలో ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్ పెడితే బాగుండేది.. కానీ చివర్లో చిన బాలయ్య వద్ద ఇరికించారు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!