బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. కింగ్ నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ కి ఎలా క్లాస్ పీకుతాడా అనేది వ్యూవర్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. అందుకే వీకెండ్ ఎపిసోడ్ ఎప్పుడూ ఆసక్తికరంగా సాగుతుంది. కానీ, ఈసారి ఫస్ట్ వీక్ కదా అని చెప్పి నాగార్జున హౌస్ మేట్స్ కి కాస్త రిలీఫ్ ఇచ్చాడు. కానీ సెట్ అండ్ కట్ గేమ్ లో హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేషన్స్ రేంజ్ లో రెచ్చిపోయారు. హౌస్ లో ఇప్పటివరకూ మీకు ఎవరితో సెట్ అయ్యింది.. ఎవరితో కట్ అయ్యింది అనేది గేమ్ ఆడించాడు కింగ్ నాగార్జున. సెట్ అయినవాళ్లకి బ్యాండ్ పెట్టాలి.
కట్ అయిన వాళ్ల ఫోటోని చింపి డెస్ట్ బీన్ లో వేయాలి. ఇక్కడే హౌస్ మేట్స్ అందరూ కాజల్ ని టార్గెట్ చేశారు. కాజల్ ఫోటోలని చింపి పారేశారు. ఫస్ట్ విశ్వ వచ్చి మానస్ ని సెట్ చేస్కున్నాడు. అలాగే కాజల్ ని కట్ చేశాడు. అక్కడ్నుంచీ కాజల్ ఫోటో చిరిగిపోవడం అనేది స్టార్ట్ అయ్యింది. లహరి, లోబో, శ్రీరామ్, నటరాజ్, ఉమా ఇంకా అనీ మాస్టర్ లు కాజల్ ని కట్ చేశారు. ముఖ్యంగా ఉమా కట్ చేసిన తీరు ఆమెకి తనపై ఉన్న కసిని చూపించింది. ఇక్కడే కాజల్ కాస్త సహనాన్ని ప్రదర్శించి శ్రీరామ్ చంద్ర ని సెట్ అని, ఉమాదేవి కట్ అని చెప్పింది.
హౌస్ లో ఏడు ఓట్లు కాజల్ కి రావడం గమనార్హం. అయితే ఇక్కడే నెక్ట్స్ వీక్ నామినేషన్స్ ని తలపించేలా హౌస్ మేట్స్ కాజల్ పై ఉన్న కసిని చూపించారు. అన్నింటిలోనూ తన ఇన్వాల్ మెంట్ ఎక్కువగా ఉంటోందని, బాగా హైపర్ అయిపోతోందని రీజన్స్ చెప్పడంతో కాజల్ స్పీడ్ కి ఈ వీక్ బ్రేక్ పడిందనే చెప్పాలి. దీంతో పాటు ‘బచ్చన్ పాండే,’ భేదియా ‘,’ గణపత్ ‘,’ హమ్ దో హమారే దో’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మరికొందరు దర్శకులు ఆమెకి కథలు చెబుతున్నారని సమాచారం.