ప్రభాస్ కోసం ఆమె.. ఫ్యాన్స్ లో భయమొక్కటే..!

‘కల్కి 2898 ఏ.డి’లో (Kalki 2898 AD)  ప్రభాస్  (Prabhas) – దిశా పటానీ (Disha Patani)  జోడీపై వచ్చిన స్పందనతో ఫ్యాన్స్ ఇంకా డౌట్లోనే ఉన్నారు. ఆ సినిమాలో ఈ జంటకు అంతగా స్కోప్ లేకపోవడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కనెక్ట్ కాలేదన్న ఫీల్ స్పష్టంగా కనిపించింది. దిశా పాత్ర గ్లామర్ పరిమితికి మాత్రమే సరిపోవడంతో, ప్రభాస్ సరసన ఆమెను మళ్లీ చూడాలనుకోవడం లేదు అభిమానులకు. ఈ నేపథ్యంలో ఫౌజీ సినిమాతో ఈ జోడీ రిపీట్ అవుతుందన్న రూమర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Fauji

అయితే ఫౌజీ (Fauji) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హను రాఘవపూడి (Hanu Raghavapudi) రొమాంటిక్ డ్రామాలపై పట్టున్న దర్శకుడు. సీతారామం వంటి ప్రేమకథల్ని ఎంతో ఎమోషనల్‌గా చూపించిన అతను, తన సినిమాలో రొమాన్స్‌కు పెద్ద పీఠ వేస్తాడు. అందుకే కల్కిలో మిస్ అయిన ఎమోషన్, కెమిస్ట్రీను ఈసారి మేకర్స్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తారనే నమ్మకం పాక్షికంగా ఉన్నా, దిశా పటానీని మళ్లీ చూసే ఉత్సాహం మాత్రం లేదు అభిమానుల్లో.

కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర యాక్షన్‌కు మాత్రమే పరిమితమవడం, రొమాంటిక్ యాంగిల్ కు స్కోప్ లేకపోవడం వల్లే ఆ జోడీ పేలలేదు అని టాక్. కానీ రిపీట్ కాంబినేషన్‌తో మళ్లీ అదే ఫీల్ మిగిలితే ఫ్యాన్స్ అంగీకరించరని నెటిజన్లు ఖచ్చితంగా చెబుతున్నారు. దిశా పాత్ర బలంగా లేకపోవడం వల్లే ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వలేకపోయిందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ ట్రోలింగ్ పరిస్థితిని గమనించిన ఫౌజీ టీం, ఇప్పటికీ దిశా పటానీ సినిమాలో ఉందని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కథ డిజైన్ లో ఎమోషనల్ డెప్త్, కేరెక్టర్ బేస్డ్ రొమాన్స్ ఈసారి ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. మొత్తంగా, కల్కిలో కెమిస్ట్రీ తప్పిపోయిన తేడా… ఫౌజీలో రిపీట్ కాకుండా చూసే బాధ్యతను మేకర్స్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం కొత్త కాంబో, కొత్త ఫీల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆయనకు సరిపోయే పాత్ర, జోడీతోనే రాబోవాలని ఆశిస్తున్నారు. అలా జరిగితే మాత్రమే ప్రభాస్ రొమాంటిక్ అవతార్‌కు మళ్లీ మజా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పెద్దితో ప్యారడైజ్.. నాని తగ్గుతాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus