Rajamouli: ఆ ట్వీట్లలో పెద్ద తప్పుంది అంటూ… ట్రోలింగ్‌!

  • December 23, 2021 / 03:10 PM IST

మన హీరో మీద నమ్మకం ఉండొచ్చు, మన హీరో మీద ప్రేమ ఉండొచ్చు. కానీ ఆ నమ్మకం అతినమ్మకం కాకూడదు, ఆ ప్రేమ అతి ప్రేమ కాకూడదు. మీరు చూపించే ఆ ‘అతి’ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ‘భీమ్లా నాయక్‌’ వాయిదాకు కారణం రాజమౌళినే అంటూ… ఆయన మీద నోరు చేసుకున్న కొంతమంది పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ గురించి. వాళ్లు పవన్‌ ఫ్యాన్స్‌ అవునో కాదో చెప్పలేం కానీ… వాళ్లు చేస్తున్న పని మాత్రం కరెక్ట్‌ కాదు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ లాంటి పాన్‌ ఇండియా సినిమాల మధ్యలో ‘భీమ్లా నాయక్‌’ రావడం ఎవరికి మంచిది కాదు. స్థూలంగా చెప్పాలంటే చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. పెద్ద సినిమాలు మూడు వారం గ్యాప్‌లో వచ్చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ విషయం మీకూ తెలుసు. ఇదే విషయంలో రాజమౌళిని, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను ట్రోల్‌ చేస్తున్న ఆ పవన్‌ ‘ఫ్యాన్స్‌’కి కూడా తెలుసు. అయితే ఎందుకో గానీ వాళ్ల మనసు దానికి ఒప్పుకోవడం లేదు అనిపిస్తోంది.

సంక్రాంతికి ‘భీమ్లా నాయక్‌’ రాకుండా అడ్డుకున్న రాజమౌళి, ఎన్టీఆరే అంటూ కారుకూతలు కూస్తున్నారు. సినిమా పరిశ్రమ మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్‌ రాజు & ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఇప్పటికే చెప్పింది కూడా. రాజమౌళి, యూవీ క్రియేషన్స్‌ కూడా ఈ విషయాన్నే ట్వీట్‌ చేశాయి. కానీ పవన్‌ ‘ఫ్యాన్స్‌’ మాత్రం ‘అదంతా అబద్దం. కావాలనే పవన్‌ సినిమాను తొక్కేశారు’ అంటూ విరుచుకుపడుతున్నారు.

అయినా రెండు పాన్‌ ఇండియా సినిమాల మధ్యలో ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్‌ చేయడం అంత అవసరమా? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దిల్‌ రాజు పంపిణీలో ఉంది, ‘రాధేశ్యామ్‌’ యూవీ క్రియేషన్ష్‌ వారిది. వారి చేతుల్లోనే తెలుగు రాష్ట్రాల థియేటర్లు ఉన్నాయి. ఈ సమయంలో ‘భీమ్లా నాయక్‌’కు థియేటర్లు దొరకడం కష్టమే. ప్రేక్షకులు ఏ సినిమా చూస్తారు అనేది వేరే విషయం. సరైన థియేటర్లు దొరకనప్పుడు, పరిశ్రమకు నష్టం అనుకున్నప్పుడు ‘భీమ్లా నాయక్‌’ టీమ్‌ తనంతట తానే వెనక్కి వెళ్లిపోతే బాగుండేది కదా.

‘సర్కారు వారి పాట’ సినిమా సంగతే తీసుకొండి. సంక్రాంతికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చేసరికి… ముందుగా పరిస్థితి అర్థం చేసుకొని ఏప్రిల్‌కి వెళ్లిపోయారు. అందుకే రాజమౌళి కూడా ఫస్ట్‌ స్టెప్‌ వేసిన మహేష్‌ అండ్‌ టీమ్‌కి థ్యాంక్స్‌ కూడా చెప్పారు. కొంతమంది పవన్‌ ‘ఫ్యాన్స్‌’ దీనిని కూడా నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్‌’ పోస్ట్‌ పోన్‌ అనౌన్స్‌మెంట్‌ వస్తే తొలుత పవన్‌కు థ్యాంక్స్‌ ట్వీట్‌ వేయకుండా, మహేష్‌కి వేశారేంటి అంటున్నారు. పవన్‌కి థ్యాంక్స్‌ చెప్పిన ట్వీట్‌లో విధానం బాలేదనే విమర్శలూ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్‌ మీద ఉన్న ‘అతి’ప్రేమ ఇలాంటి పనులు చేయిస్తోంది. ఇదెంతవరకు కరెక్టో వాళ్లే ఆలోచించుకోవాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus