తెలుగు చలన చిత్ర పరిశ్రమ.. తమిళ చిత్ర పరిశ్రమ మీద మరీ ఎక్కువగా ఆధారపడిపోతోందా? అయినా ఇదే డౌట్… మన దేశానికి పాన్ ఇండియా సినిమాలు ఇస్తున్నాం మనం ఇంకొకరి మీద ఆధారపడటం ఏంటి? అని అనుకుంటున్నారా? మిగిలిన విషయాల్లో ఏమో కానీ.. ఓ విభాగం విషయంలో మాత్రం మన దర్శకులు, నిర్మాతలు.. ఆ మాటకొస్తే హీరోలు కూడా తమిళ సినిమా పరిశ్రమ మీద, అక్కడి టెక్నీషియన్ల మీద బాగా ఆధారపడిపోతున్నారు అనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి. అన్నట్లు ఆ విభాగం చెప్పలేదు కదా.. ఇంకేముంది మ్యూజిక్ డైరక్షన్.
టాలీవుడ్‌ని (Tollywood) మ్యూజిక్ డైరెక్టర్ల కొరత చాలా వేధిస్తోంది. స్టార్ హీరోల సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఇది బాగా కనిపిస్తోంది అని చెప్పాలి. తమన్, దేవిశ్రీ ప్రసాద్ తప్ప మరో ఆప్షన్ టాలీవుడ్‌లో ఉన్నా.. ఎవరూ అటువైపు ఆలోచించడం లేదు. అయితే తమిళ సినిమా లేదంటే మలయాళ సినిమా వైపు చూస్తున్నారు. కావాలంటే మీరే చూడండి… అనిరుధ్ చేతిలో ‘దేవర’, విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’, నితిన్ – వెంకీ కాంబో, ‘ఆదికేశవ’ తదితర చిత్రాలు చేస్తున్నాడు.
ఇటీవల వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ సినిమా కూడా జీవీకే ఇచ్చేశౄరు. నితిన్ – వక్కంతం వంశీ సినిమాకు హరీష్ జైరాజ్ పని చేస్తున్నారు. రామ్‌చరణ్ – బుచ్చిబాబు సానా సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ అంటున్నారు. విశ్వక్ సేన్ కొత్త సినిమాకు యువన్ శంకర్ రాజా పని చేస్తున్నారట. మలయాళం నుండి గోపీ సుందర్, హేశం అబ్దుల్ వహాబ్ టాలీవుడ్‌లో మంచి అవకాశాలు సంపాదించారు.
అయితే ఇక్కడో విషయం మనం గుర్తుంచుకోవాలి. అదే.. తమన్, దేవి టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసి ఇక్కడివాళ్లు అయ్యారు కానీ.. ఇప్పటికీ వాళ్లు వర్క్ చేసేది తమిళనాడులో ఉండే. దీంతో తెలుగు సంగీతం దాదాపు తమిళ సినిమా ఇండస్ట్రీ మయం అని జోకులు కూడా వినిపిస్తున్నాయి.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!