మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గీతా ఆర్ట్స్ అనేది ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిరు సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు (Mechanic Alludu) లాంటి బ్లాక్ బస్టర్స్ గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలై చిరంజీవి (Chiranjeevi) కరీర్‌లో కీలకమైన సినిమాలుగా నిలిచాయి. కానీ చిరు రీ ఎంట్రీ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
చివరగా చిరు గీత ఆర్ట్స్ లో చేసిన సినిమా డాడీ. ఇక చిరు రీ ఎంట్రీ సమయంలో తనయుడు రామ్ చరణ్ (Ram Charan) “కొణిదెల ప్రొడక్షన్స్” అనే కొత్త బ్యానర్‌ను స్థాపించి వరుసగా నాలుగు సినిమాలను నిర్మించారు. ‘ఖైదీ నంబర్ 150,(Khaidi No. 150) ‘ ‘సైరా నరసింహా రెడ్డి, (Sye Raa Narasimha Reddy)‘ ‘ఆచార్య (Acharya) ,’ ‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమాలు ఇతర బ్యానర్లతో కొంత దూరంగా ఉండటాన్ని చూపించాయి. ఇక గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా ఉండకపోవడం వెనుక ప్రత్యేక కారణం లేకపోయినా, అందరికీ కనిపించిన విషయం మాత్రం అంచనాల భారం కావచ్చు.
గీతా ఆర్ట్స్ గత కొంతకాలంగా పెద్ద ప్రాజెక్ట్‌లకు కాకుండా మీడియం రేంజ్ సినిమాలకు ఎక్కువగా ఫోకస్ చేసింది. అల్లు అరవింద్ (Allu Aravind) పర్యవేక్షణలో బన్నీ వాసు (Bunny Vasu ) గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమాలను హ్యాండిల్ చేస్తూ, కొత్త డైరెక్టర్స్, హీరోలతో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ లను తీసుకువస్తున్నారు. బన్నీ, అరవింద్ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్టులు మాత్రం గీతా ఆర్ట్స్ కి భారీ విజయాలను తీసుకొచ్చాయి. ఇక మెగాస్టార్-అరవింద్ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నా, అభిమానులు మాత్రం ఎందుకు ఈ కాంబో రీ ఎంట్రీ తర్వాత రాలేదని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.
చిరు (Chiranjeevi) సినిమా అంటే ఆడిషనల్ ప్రెషర్ కావచ్చు, లేదా సరైన కథ కోసం ఎదురుచూడటం కావచ్చు. కానీ ఫ్యామిలీకి గ్యాప్ లేదని, అన్ని సరైన సమయంలోనే జరగాలని ఇరు కుటుంబాలూ స్పష్టంగా చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గీతా ఆర్ట్స్ నుంచి చిరు సినిమా వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తున్నా, సరైన స్క్రిప్ట్‌తో అందరి అంచనాలను దాటేలా ఈ కాంబో మళ్లీ తెరపైకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.