నిఖిల్ చాలా మొండి వాడట…కారణం!

మొండి వాళ్ళు అందరూ హీరోలు కాలేరు కానీ, హీరోల్లో చాలా మంది మొండి వాళ్ళు ఉన్నారు అన్నది నిజం. మన తెలుగు సినిమాలే తీసుకుంటే కొందరు హీరోలు కమర్షిల్ సినిమాలు చేసుకుంటూ ఆ సరిహద్దులు దాటి బయటకు రాకుండా వాళ్ళకు భజన చేస్తున్న వాళ్ళ కోసం అదే తరహా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. అయితే అదే క్రమంలో చిన్న హీరోలు చాలా మంది సరికొత్త కధలకు ప్రాణం పోస్తూ తమలోని టాలెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నారు. అలా చిన్న హీరోల్లో ఒకడైన నిఖిల్ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకునే అందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే వరుస హిట్స్ తో మంచి హీరోగా నేమ్ సంపాదించుకున్న నిఖిల్, లాస్ట్ ఇయర్ డీమానిటైజేషన్ టైంలో కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకుని తన సత్తా నిరూపించుకుని ప్రస్తుతం కేశవతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సుధీర్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో అభిషేక్ నామా నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కథ ట్రైలర్ లో చూపించినట్టుగా కుడి వైపు గుండె ఉన్న వ్యక్తి ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే అయితే అలా కుడి వైపు గుండె ఉన్న వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. ఎలాంటి టెన్షన్ పడ్డ హార్ట్ స్ట్రోక్ రావడం ఖాయం. అయితే ఈ కధను సుధీర్ వర్మకు తెలిసిన ఓ వ్యక్తి నిజంగానే ఇలా కుడిపక్క గుండెతో ఉండడం వల్ల ఆ స్పూర్తితో రాశాడట. ఇదిలా ఉంటే ఈ పాత్ర చేసే అప్పుడు నిఖిల్ క్యారెక్టర్ గురించి సుధీర్ వర్మ ఆడియోలో మాట్లాడుతూ, అలాంటి వ్యక్తి ఉన్నాడని తెలిసినా మళ్లీ తను ఎక్కడ తనని చూసి అతన్ని ఫాలో అవుతానో అని నిఖిల్ అతన్ని చూడకుండానే సినిమా చేసాడని, అంతేకాకుండా తాను కొంత ఎక్స్ పెక్ట్ చేస్తే అంతకుమించి చేసి సినిమా అద్భుతంగా వచ్చేలా చేశాడని నిఖిల్ గురించి సుధీర్ చెప్పడం విశేషం. అయితే కథలో ఒరిజినల్ పాత్ర ఉన్నా సరే అతన్ని చూడకుండా సినిమా చేయడం నిఖిల్ మొండితనానికి నిదర్శనం అనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా మంచి హిట్ అయ్యీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుందాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus