‘పుష్ప’ సినిమా ప్రచారం కోసం లేట్‌గా వెళ్లినందుకు అల్లు అర్జున్ కన్నడ మీడియాకు సారీ చెప్పాడు. ‘కేజీయఫ్’ సినిమా ప్రచారం కోసం విశాఖపట్నం వచ్చిన యశ్… ఆలస్యానికి మీడియాకు సారీ చెప్పాడు. ఈ రెండు వేర్వేరు కావొచ్చు. అక్కడ జరిగింది కాబట్టి.. ఇక్కడా జరిగింది అనే లాజిక్ ఉండొచ్చు. ఇదంతా పక్కనపెట్టేస్తే అసలు ఎందుకు ఇలా లేట్ అవుతుంది. సినిమా పీఆర్ టీమ్ ఆ మాత్రం ప్లానింగ్ వేసుకోలేదా? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఈ ‘ఆలస్యం’ కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి అంటే… అసలు ఆలస్యాలు ఇవేనా, ఇంకా ఉన్నాయా అనేది చూడాలి. బయట ప్రేక్షకులకు తెలియదు కానీ, టాలీవుడ్ మీడియాకు ఈ ఆలస్యాల బాధ బాగా తెలుసు. అగ్ర హీరో నుండి, అప్పుడే హీరో అయిన వాళ్ల వరకు చాలామంది మీడియాను వెయిట్ చేయించేవాళ్లు. మీడియాను వెయిట్ చేయించడం అంటే ఆలోమేటిగ్గా ప్రేక్షకుల్ని వెయిట్ చేయించడమే. అభిమాన హీరో/ హీరోయిన్‌ను చూద్దామని వెయిట్ చేసే వాళ్లకు నిరాశ తప్పడం లేదు.
మరి ఈ వ్యవహారంలో తప్పెవరిది. ట్రాఫిక్ వల్లనో, ఫ్లైట్ ఆలస్యం వల్లనో ఈవెంట్ రాలేకపోయారు అంటే ఓ లెక్క. అంతేకానీ వరుస ఈవెంట్ల వల్ల ఆలస్యమయ్యామని చెబితే ప్లానింగ్ చేసే పీఆర్ టీమ్‌దే తప్పు అనొచ్చు. అలా అప్పుడు ‘పుష్ప’ టీమ్ కానీ, ఇప్పుడు ‘కేజీయఫ్ 2’ టీమ్ ఆలస్యమై సారీలు చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఆ రోజు బన్నీ సారీ చెప్పేసి… ‘తగ్గినోడు తక్కోవడు కాదు…’ అంటూ ఏవేవో వేదాంతాలు చెప్పాడు. యశ్ అలా కాకుండా సారీ చెప్పేశాడు.
ఇలా బహిరంగంగా ‘ఆలస్యం’ అడిగితేనే హీరోలు కానీ, వాళ్ల టీమ్ కానీ స్పందిస్తున్నారు. సాధారణ ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూల విషయంలో అయితే ‘లేట్ అయ్యిందా.. నాకు ఈ టైమే చెప్పారే’ అనే హీరోలు చాలామంది టాలీవుడ్‌లో ఉన్నారు. మరి మిగిలిన ఇండస్ట్రీల్లో ఎలా ఉందో తెలియదు కానీ. తెలుగులో అయితే ఇండియన్ టైమింగ్ అంటూ మనం సరదాగా అనుకునే టైమింగ్ కాన్సెప్ట్ బాగా ఫాలో అయిపోతారు. అప్పుడు సారీలు లాంటివి చెప్పడాలు ఉండవు. అన్నట్లు యశ్ సారీ చెప్పంది విశాఖపట్నం మీడియాకు అనే విషయం గుర్తుంచుకోవాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!