‘మేజర్’ సినిమా టీమ్‌కి ఎంత ధైర్యం… సినిమా విడుదలకు పది రోజుల ముందు నుండే సినిమా స్సెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు అంటూ చాలామంది అనుకుంటున్నారు. నిజమే ఇలా ముందుగానే సినిమా వేయడానికి చాలా ధైర్యం కావాలి. అయితే ఇక్కడో మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. అదే హైదరాబాద్ జనాలకు అంటే తెలుగు జనాలకు జరిగిన అన్యాయం. ‘మేజర్’ పాన్ ఇండియా సినిమానే కావొచ్చు, కానీ తొలుత అది తెలుగు సినిమా. అలాంటిది తెలుగు ప్రేక్షకులు ముందుగా ఆ సినిమా చూడటానికి అర్హులు కారా?
ఈ ప్రశ్నే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కారణం ‘మేజర్’ ప్రీమియర్ షోస్ 24 నుండి స్టార్ట్ అవుతున్నాయి. తొలి షో 24న పుణెలో వేస్తున్నారు. పోనీ బాలీవుడ్ జనాల్లో హైప్ కోసం అలా చేస్తున్నారు అనుకుందాం. రెండో షో అయినా హైదరాబాద్‌లో పడుతుందా అని అనుకుంటే 25న జైపూర్, అహ్మాదాబాద్‌లో వేస్తున్నారు. అలా అన్ని చోట్లా షోలు వేసుకొని ఆఖరున జూన్ 2న అంటే సినిమా విడుదలకు ఒక రోజు ముందు హైదరాబాద్‌లో సినిమా వేస్తున్నారు.
దీంతో ‘మేజర్’ను పది రోజులు ముందు, కనీసం వారం ముందు చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకుల విషయంలో ఇలా ఎందుకు ఆలోచించారు అనేది తెలియడం లేదు. తెలుగు ప్రేక్షకులు ముందు చూసేస్తే సినిమా ఎలా ఉందో తెలిసిపోతుంది అనా, లేక సినిమా రివ్యూలు బయటకు వచ్చేస్తాయనా అనేది తెలియడం లేదు. అక్కడెక్కడో బాలీవుడ్ రిపోర్టర్లు చూస్తే రివ్యూలు రాసేయరా ఏంటి?
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సినిమా షో తమిళనాడులో వేయడం లేదు. చెన్నైలో షో ఉంటుంది అనుకున్న ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కూడా షోలు పడటం లేదు. ఒడిశాలో ఎప్పుడూ ఇలాంటి షోలు వేసిన దాఖలాలు లేవు. కానీ వెస్ట్ బెంగాల్‌లో ఎందుకు షో వేయడం లేదు అనేది కూడా తెలియడం లేదు. తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా అంటే బెంగళూరులోనే షో పడుతోంది. అది కూడా మే 30న. ఎవరైనా తెలుగు వాళ్లు ముందే సినిమా చూడాలంటే బెంగళూరు వెళ్లాల్సిందే.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!