Jr NTR: కొత్త సినిమా విషయంలో తారక్‌ మల్టిపుల్‌ థాట్స్!

కెరీర్‌ విషయంలో తారక్‌కి చాలా క్లారిటీ ఉంది అని చెబుతుంటారు. ఆయనతో పని చేసిన దర్శకులు, నటులూ కూడా ఇదే మాట గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు తారక్‌ తన తర్వాతి సినిమా గురించి చిన్నగా క్లారిటీ మిస్‌ అయ్యారా? లేక డబుల్‌ థాట్స్‌లో ఉన్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. రెండు, మూడు కథల్ని దగ్గర పెట్టుకుని దేనిని ప్రారంభించాలి అనే ఆలోచనలో తారక్‌ ఉన్నాడని అంటున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’తో తారక్‌ సినిమా అంటే.. కొరటాల శివ సినిమా అని అనుకున్నాం. అయితే కొరటాల తీసిన ‘ఆచార్య’ ఫట్‌ మనడడంతో కథ విషయంలో తారక్‌ రెండోసారి ఆలోచించాల్సి వచ్చిందట. దీంతో అనుకున్న కథలో మార్పులు అవసరం అనిపించి, అదే విషయంలో కొరటాలకు చెప్పారట. దీంతో కొరటాల అండ్‌ కో గత కొన్ని రోజులుగా దాని మీదే కుస్తీ పడుతున్నారట. దీంతో సినిమా ఆలస్యం అవ్వొచ్చు అని వార్తలొచ్చాయి. ఈలోగా తారక్‌ పుట్టిన రోజు సంద్భంగా టీజర్‌ వీడియో ఇచ్చి సినిమా లైన్‌లోనే ఉంది అని చెప్పకనే చెప్పారు.

ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వేరేలా ఉంది అని అంటున్నారు. కొరటాల శివ కథ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, కాస్టింగ్‌ విషయంలో పరిస్థితులు, ఆలోచనలు మారడంతో వేరే సినిమా వైపు తారక్‌ మనసు మళ్లింది అని అంటున్నారు. అంటే కొరటాల శివకు ఇంకాస్త సమయం ఇచ్చి పవర్‌ ఫుల్‌ కథను సిద్ధం చేయమని కోరారట తారక్‌. ఈలోపు విదేశీ పర్యటన ముగించుకుని వస్తా అని వెళ్లారట. అయితే వచ్చాక తొలుత కొరటాల శివ సినిమానే మొదలవుతుందని చెప్పలేం అంటున్నారు సన్నిహితులు.

దీనికి కారణం బుచ్చిబాబు సానా ఎన్టీఆర్‌ కోసం సిద్ధం చేసుకున్న కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని వార్తలొస్తున్నాయి. అలాగే తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ కథను ఇటీవల తారక్‌ విన్నాడనే వార్తలు దీనికి అదనం. దీంతో తారక్‌ డబుల్‌ థాట్స్‌ ఇంకా కొలిక్కి రాలేదని చెబుతున్నారు. విదేశాల నుండి వచ్చాక దీనిపై క్లారిటీ ఇచ్చేస్తారని చెబుతున్నారు. చూద్దాం తారక్‌ సినిమాల రేసులో నెక్స్ట్‌ వచ్చేది ఏదో.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus