Anirudh: ఇవ్వకపోవడాన్ని ఇవ్వడంతో కవర్‌ చేసిన అనిరుథ్!

సినిమా మంచి విజయం అందుకుంటే ఆ సినిమాకు పని చేసినవారికి హీరోలు గిఫ్ట్‌లు ఇవ్వడం మనం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. పెద్ద హీరోలు, కుర్ర హీరోలు ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో సీనియర్‌ స్టార్‌ హీరోలు కూడా ఈ పని చేస్తున్నారు. అలా కమల్‌ హాసన్‌ కూడా ‘విక్రమ్‌’ సినిమా విజయం పురస్కరించుకుని టీమ్‌ మెయిన్‌ సభ్యులకు గిఫ్ట్‌లు ఇచ్చాడు. అయితే కమల్‌ నుండి గిఫ్ట్‌లు అందుకున్న వారి జాబితాలో సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచంద్రన్‌ లేకపోవడం గమనార్హం.

ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ‘విక్రమ్‌’ ద్వారా కమల్‌ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కమర్షియల్‌ విజయం అందుకున్నందుకుగాను చాలా ఆనందంగా ఉన్నారు. సొంత నిర్మాణ సంస్థలోనే సినిమా తెరకెక్కడంతో లాభాలన్నీ తనకే చెందుకున్నాయి. దీంతో పాత అప్పులు మొత్తం తీర్చేస్తున్నారట. దాంతోపాటు సినిమాకు పని చేసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కి కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు కమల్‌. రోలెక్స్‌గా సినిమాలో అదరగొట్టిన సూర్యకి రోలెక్స్‌ వాచ్‌ ఇచ్చాడు. మిగిలిన టీమ్‌కి కూడా కొన్ని గిఫ్ట్‌లు ఇచ్చినట్లు సమాచారం.

అయితే సినిమాకు అదిరిపోయే సంగీతం ఇచ్చిన అనిరుథ్‌కి మాత్రం ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. సినిమా విజయంలో అనిరుథ్‌ సంగీతానికి సింహ భాగం ఇవ్వాల్సిందే. అలాంటిది అనిరుథ్‌కి ఎందుకు గిఫ్ట్‌ ఇంకా ఇవ్వేలేదు అనేది తెలియాలి. అయితే ఇదే మాట అనిరుథ్‌ దగ్గర అంటే.. అతనో డిఫరెంట్‌ సమాధానం చెప్పాడు. లోకేశ్‌కి కారు, సూర్యకి వాచీ ఇచ్చిన కమల్.. మీకేమీ ఇవ్వలేదా అని అడిగితే… ‘‘నాకు ‘విక్రమ్’ సినిమాను ఇచ్చారు. ఇంకేం కావాలి’’ అన్నాడు అనిరుధ్.

అనిరుధ్‌ చెప్పింది కవర్‌ చేసుకోవడానికి చెప్పిన సమాధానమే కానీ.. సరైన ఆన్సర్‌ కాదు అనేది అందరికీ తెలుసు. టెక్నీషియన్లతో కమల్‌ హాసన్‌ ఎప్పుడూ వైరం పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకొని ఉంటే అనిరుథ్‌ సినిమా ప్రచారంలో పాల్గోడు. మరి అంతా బాగానే ఉంటే ఎందుకు గిఫ్ట్‌ ఇవ్వనట్లు అనేది తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus