అభిమానమైనా ప్రేమైనా హద్దులలో ఉన్నంత వరకే అందంగా ఉంటుంది. అది హద్దులు దాటిన క్రమంలో అనేక ఇబ్బందులకు కారణం అవుతుంది. స్టార్ హీరోల ఫ్యాన్స్ అత్యుస్తాహం కొన్ని సార్లు కొందరిని ఇబ్బందులలోకి నెడుతుంది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ముందుంటారు. తాజాగా మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ కోవలోకి చేరారు అనిపిస్తుంది. దానికి నేటి ఘటనే ఉదాహరణ. నేడు మహేష్ సోషల్ మీడియాలో ఓ సందేశం పంచుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ దూరంగా ఉండాలని, గుంపులుగా చేరి వేడుకలు నిర్వహించకుండా, సామాజిక దూరం పాటిస్తూ దూరంగా ఉండాలి అన్నారు.
కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ భద్రంగా ఉండాలని సూచించారు. మహేష్ ట్వీట్ ట్యాగ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గ్రేట్ గెచ్చర్ బ్రదర్ అని ట్వీట్ చేశారు. ఇదే మహేష్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది. ఒకప్పుడు సర్ అనే థమన్ మహేష్ ని బ్రదర్ అని సంబోధించాడు, అతనికి పొగరు ఎక్కింది అని కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి బ్రదర్ అనడంలో తప్పేముంది. ఆంగ్ల వాడుకలో బ్రదర్ అనే పదాన్ని మన కంటే పెద్ద వాళ్లకు, చిన్న వాళ్లకు కూడా ఉపయోగిస్తాం. థమన్ బ్రదర్ అన్న పిలుపులో మహేష్ ఫ్యాన్స్ అన్నయ్య అనే గౌరవ భావం ఊహించుకోవచ్చు కదా.
అది వదిలేసి థమన్ కి పొగరెక్కింది అనుకోవడంలో అసలు లాజిక్ లేదు. గతంలో సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ ఎన్టీఆర్ ని తన డైలాగ్స్ లో రా అని సంబోధిస్తారు. అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానిని హైలెట్ చేయడంతో పాటు, ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయంలో తిట్టాలి అనుకుంటే, మూవీలో ఆ డైలాగ్ పెట్టిన రాజమౌళిని తిట్టాలి. అలా కాకుండా లేట్ వేణుమాధవ్ పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కఠినంగా వ్యవహరించారు. మరి మన స్టార్ హీరో ఫ్యాన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతాడో చూడాలి.