NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు మంచు ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదా?

సీనియర్ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను తాజాగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ తారలు రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు. ఇక ఈ శత జయంతి వేడుకలలో భాగంగా అక్కినేని ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు హాజరయ్యారు.

అయితే ఎన్టీఆర్ (NTR) గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి మంచు ఫ్యామిలీ మాత్రం దూరంగా ఉంది.ఎన్టీఆర్ గారికి మోహన్ బాబు గారికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది మోహన్ బాబు ఎన్టీఆర్ గారిని అన్నగారు అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఎన్టీఆర్ రాజకీయాలలో కొనసాగుతున్న సమయంలో మోహన్ బాబు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాలలో చాలా చురుక పాల్గొన్నారు.

ఇలా ఎన్టీఆర్ మోహన్ బాబు మధ్య చాలా మంచి సఖ్యత ఉంది అయితే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కొంతకాలం పాటు చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేసిన మోహన్ బాబు తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీ పంచన చేరారు. ఇలా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నటువంటి మోహన్ బాబుని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా జరుగుతున్న నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదని సమాచారం. ఇక మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. కనీసం మా ప్రెసిడెంట్ కి కూడా ఆహ్వానం అందకపోవడం గమనార్హం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus