చిరంజీవి – చరణ్‌ కొత్త సినిమాల విషయంలో చిక్కుముడులు ఎన్నో?

మా హీరో నెక్స్ట్‌ సినిమాలు ఇవీ, ఇదిగో లైనప్‌ అంటూ అభిమానులు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సినిమా కాస్త అటు ఇటు అయినా తర్వాత అదరగొడతాం అనే ధైర్యం ఆ లైనప్‌తోనే వస్తుంది. అయితే ఇలాంటి కీలకమైన విషయంలో మెగా తండ్రీ కొడుకులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఏమో సినిమాల పేర్లు వినిపిస్తున్నా, ఆసక్తిగా అనిపిస్తున్నా.. ఎక్కడా ఫుల్‌ క్లారిటీ రాకపోవడమే ఈ డౌట్‌కి కారణం అంటున్నారు. అంతలా ఏమైంది అనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి మరి.

ముందు మెగాస్టార్‌ సంగతి చూద్దాం. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్‌ తర్వాత చిరంజీవి సినిమాలేంటి అంటే.. ‘భోళా శంకర్‌’ పేరు ఒక్కటే వినిపిస్తోంది. ఎందుకంటే మిగిలిన సినిమాల సంగతులు ఇంకా తేలలేదు కాబట్టి. వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య సినిమా అనుకున్నా అది మెటీరియలైజ్‌ కాలేదు. దీంతో తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉండిపోయింది. పూరి జగన్నాథ్‌, మురుగదాస్‌, కల్యాణ్‌ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి తప్ప ఎవరూ క్లియర్‌ కాలేదు.

ఇక రామ్‌చరణ్‌ సంగతి చూస్తే కాస్త బెటర్‌ కానీ.. మొత్తంగా కాదు. శంకర్‌ సినిమా అయిపోయాక చరణ్‌ ఏ సినిమా స్టార్ట్‌ చేస్తాడు అనే విషయంలో క్లారిటీ కావాలి. గతంలో వచ్చిన వార్తల ప్రకారం సుకుమార్‌ సినిమా చేయాలి. ఈ సినిమా ఓపెనింగ్‌ షాట్‌ కూడా షూట్‌ చేశారు. అయితే ఇప్పుడు బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చారు. అలాగే నర్తన్‌ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో చరణ్‌ నెక్స్ట్‌ ఏ సినిమాలో అనే క్వశ్చన్‌ అలానే ఉండిపోయింది.

అన్నట్లు చిరంజీవి ఖాతాలోకి మరో దర్శకుడు కూడా ఉన్నారు. అతనే వి.వి.వినాయక్‌. చాలా రోజులుగా వినాయక్‌ – చిరంజీవి సినిమా అనే టాక్‌ ఉన్నా.. కథ రెడీగా లేదని టాక్‌. ఏదైనా రీమేక్‌ కథ తీసుకొస్తారు అని అంటున్నా.. అది కూడా తేలడం లేదు. మరోవైపు చరణ్‌ సినిమాల లిస్ట్‌లో లోకేశ్‌ కనగరాజ్‌ పేరు కూడా ఉంది. ‘లియో’లో చరణ్‌ చిన్న పాత్ర దానికి లీడ్‌ అని టాక్‌. చూడాలి ఎప్పుడిస్తారో క్లారిటీ ఈ తండ్రీ కొడుకులు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus