గతంలో విజయ్ దేవరకొండ మీడియా పై ఫైట్ చేస్తుంటే.. సినిమా పెద్దలు అందరూ స్పందించి అండగా నిలబడ్డారు. అక్కడి వరకూ బాగానే ఉంది. అయితే విజయ్ దేవరకొండ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్..తన పై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానల్ పేర్లతో సహా బయటపెట్టి పోరాడితే పట్టించుకున్న వాళ్ళే లేరు. సరే ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు లెండి. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. 3 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదల అయ్యింది. మొదటి షో తోనే హిట్ టాక్ ను సంపదించుకుని మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
అయితే ఈ చిత్రానికి టికెట్ హైక్స్ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే అందుకు నిరాకరించింది. హైకోర్టుకి వెళ్ళినా ఉపయోగం లేదు. తెలంగాణ వరకూ ఓకె.. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వకీల్ సాబ్ కు న్యాయం జరగలేదు. కారణం అక్కడి అధికార ప్రభుత్వమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దీని పై పవన్ అభిమానులు ఆందోళన చెందుతూ నిరసనకు దిగితే.. సినీ ఇండస్ట్రీ నుండీ పెద్దలు స్పందించడం లేదు. తమ్ముడి సినిమా విషయంలో చిరంజీవి పట్టించుకోవడం లేదు. సినీ పరిశ్రమకు ఏదో పెద్ద సాయం చేసాడని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన చిరు..
తమ్ముడి సినిమాకి న్యాయం జరుతుంటే నోరు మెదపడం లేదు. ఇక మహేష్ బాబు గతంలో అర్జున్ సినిమా పైరసీ విషయములో పోరాడుతుంటే… పవన్ అండగా నిలిచాడు. అతను కూడా స్పందించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నిత్య అవసరాల ధరలు పెరిగిపోయినప్పుడు లైట్ తీసుకున్న జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల హైక్ విషయంలో మాత్రం అదేదో భారం అన్నట్టు ఆరోపణలు చేస్తుంది. ఇది రాజకీయాల పగలను పెట్టుకుని కక్ష సాధించడమే కదా..!