బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్ నాగార్జున వచ్చే రోజులే టీఆర్పీ రేటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. శని – ఆది వారాల్లో ఈ షో రేటింగ్ మాములు రోజుల కంటే కూడా డబుల్ , ట్రిబుల్ ఉంటుంది. అందుకే, నాగార్జున శనివారం హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతూ వారం రోజులపాటు వాళ్లు చేసిన మిస్టేక్స్ ని చెప్తుంటారు. అయితే, మూడోవారం హౌస్ మేట్స్ కి నాగార్జున పీకిన క్లాస్ సరిపోలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శనివారం నాగార్జున శ్రీహాన్ – ఇనయ ఇష్యూలని అడ్రస్ చేశాడు. వాడు అంటే నీకు కోపం వచ్చినపుడు పిట్టా అంటే ఇనయకి కూడా కోపం వస్తుందని శ్రీహాన్ కి క్లాస్ పీకారు.
అయితే, ఇక్కడ ఇద్దరి మద్యలో ఫ్రెండ్షిప్ ఉంటే ఏదైనా సరే బాగుంటుందని, ఆ రిలేషన్ లేనపుడు ఏది మాట్లాడినా బూతుగానే ఉంటుందని చెప్పారు. ఇక్కడే గీతు ఎందుకు ఇన్వాల్ అయ్యావంటూ అడిగారు. దీనికి గీతు నేను క్రిటిసైజ్ చేశానని, ఏదైనా లోపల అలా పెట్టుకోలేని కసి తీర్చుకోవాల్సిందే అని చెప్పింది. దీనికి నాగార్జున ఫైర్ అవ్వకుండా వదిలేశారు. అంతేకాదు, టాస్క్ ల్లో అందుకే ఫెయిల్ అవుతున్నావని, నీకు నోటిదూల అంటూ మందలించారే తప్ప, తన బిహేవియర్ ని ప్రశ్నించలేదు. ఇప్పుడు నాగార్జున గీతుకి ఎందుకు క్లాస్ పీకలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
మరోవైపు గీతు బాలాదిత్యకి ప్రీచింగ్ గురించి ఉపదేశం చేసింది. పనివాళ్ల గురించి మాట్లాడింది. దీనిపైన కూడా నాగార్జున స్పందించలేదు. రియాలిటీ షోలో ఏం జరిగితే అది చూపించేస్తారా.. ? రేపు గీతు లాగా సోసైటీలో చాలామంది అవుతారు అప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఆ వీడియో ప్లే చేసి గీతు ఏం మాట్లాడుతోందో చెప్పించి ఉండాల్సిందని రెచ్చిపోతున్నారు. కేవలం గీతుని రేటింగ్ కోసమే మందలించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే నాగార్జున కూడా టీఆర్పీ రేటింగ్స్ కోసం గీతు చేసే పనిని, మాటల్ని బయట పెట్టడం లేదని అంటున్నారు. ఇలాగైతే హోస్ట్ గా నాగార్జున హౌస్ మేట్స్ కి ఏం చెప్తారని కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ షో అంటే రియాలిటీ షో. ఇందులో వీకెండ్స్ నాగార్జున హౌస్ మేట్స్ చేసే కాంట్రవర్సీ కామెంట్స్ ని, పిచ్చివాగుడ్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అలాగే, వారి ఆటతీరు ఇద్దరిమద్యలో జరిగిన పంచాయితీని తీర్చాలి. ఇలా కాకుండా రేటింగ్ కోసం వదిలేస్తే ముందు ముందు షో చూడాలన్ని ఇంట్రస్ట్ పోతుందని బిగ్ బాస్ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.