ఇటీవల విడుదలైన రజినీ కాంత్ ‘దర్బార్’ చిత్రం తమిళంలో హిట్ గా నిలిచినప్పటికీ.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ వరకూ ఓకే అనిపించినా.. సెకండ్ హాఫ్ విషయంలో బాగా నిరాశపరిచిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ నయన తార పాత్ర గురించి కూడా ఎక్కువ కామెంట్స్ వినిపిస్తుండడం గమనార్హం. ఈ చిత్రంలో నయన్ పాత్ర కంటే కూడా రజినీ కూతురిగా నటించిన నివేదా థామస్ పాత్రే బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయన తార .. సినిమాకి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నప్పటికీ.. సరైన పాత్రలు ఎంచుకోవట్లేదని ఆమె అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ‘దర్బార్’ చిత్రంలో ఆమె 25 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అందులోనూ పాత్రకి పెద్ద ప్రాధాన్యత కూడా లేదు. ఇక మెగాస్టార్ ‘సైరా’ చిత్రం విషయంలో కూడా నయన్ పాత్ర తక్కువే. అంతేకాదు విజయ్ ‘విజిల్’ చిత్రంలో కూడా నయన్ పాత్ర ఏదో ఇరికించినట్టే ఉంటుంది. అసలు ఈమె ఇలాంటి పాత్రలు ఎందుకు ఎంచుకుంటుందా అని వారు డిజప్పాయింట్ అవుతున్నారు.