Mahesh Babu: ప్రభాస్‌ వస్తే పక్కకు జరుగుతున్నారు… మహేష్‌కి భయపడటం లేదా?

  • October 13, 2023 / 04:53 PM IST

డిసెంబరు 22న టాలీవుడ్‌లో ఒకప్పుడు మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్క సినిమానే వస్తోంది. అదే ‘సలార్‌’. నిజానికి సెప్టెంబరు ఆఖరులో రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఆలసమైంది. అయితే ఇక్కడ విషయం ‘సలార్‌’ కాదు. ఆ సినిమా వస్తోంది అంటే… మిగిలిన సినిమాలు పక్కకు వెళ్లిపోవడం. అంతేకాదు ప్రభాస్‌ అంతటి ఇమేజ్‌ ఉన్న మహేష్‌బాబు సినిమా వస్తోంది అని తెలిసినా… మిగిలిన సినిమాలు ఎలాంటి బెరకు లేకుండా సంక్రాంతి రిలీజ్‌కి రెడీగా ఉండటం.

అవును, కావాలంటే మీరే చూడండి. మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి వస్తుందని నిర్మాణ సంస్థ అంత నమ్మకంగా చెబుతున్నా… ఇతర సినిమాల జనాలు అస్సలు బెరకడం లేదు. తమ సినిమా కూడా సంక్రాంతికే తీసుకొస్తామని అంటున్నారు. అలాగే కొత్త సినిమాలు కూడా సంక్రాంతి డేట్‌ కోసం చూస్తున్నాయి. దీంతో మహేష్‌ సినిమాకు భయపడటం లేదా? లేక సినిమా ఆ సమయానికి వస్తందని నమ్మడం లేదా అనే ప్రశ్న మొదలైంది.

2024 సంక్రాంతి కోసం ప్రస్తుతం ఆరేడు సినిమాలు బరిలో ఉన్నాయి. తేజ సజ్జా – ప్రశాంత్‌ వర్మ ‘హను-మాన్’, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగా’, వెంకటేశ్‌ ‘సైంధవ్’ సంక్రాంతి డేట్‌ చెప్పేశాయి. సంక్రాంతి సీజన్‌కు పెద్ద హీరోల సినిమా రెండు, ఒక చిన్న సినిమా రావడం కొత్తేమీ కాదు. గతంలో ఇలా జరిగింది కూడా. కానీ ఇన్ని సినిమాలు రావాలని అనుకోవడం మాత్రం ఇదే తొలిసారి. అయితే వీటిలో ఏ సినిమాలు ఫైనల్‌గా నిలుస్తాయి అనేది పక్కనపెడితే…

మహేష్‌ (Mahesh Babu) సినిమా ఉన్నా ఇంతమంది ఎందుకు ముందుకొస్తున్నారు అని. దీనికి సమాధానంగా వినిపిస్తున్న ఏకైక మాట.. ‘నమ్మకం’. అంటే వాళ్ల సినిమా మీద వాళ్లకు నమ్మకం మాత్రమే కాదు. ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రెడీ అవ్వకపోవచ్చనే నమ్మకం కూడా. ఇప్పటికే నానా స్టాపులతో నడుస్తున్న ఈ సినిమాకు దసరా సందర్భంగా మళ్లీ స్టాపులు ఉంటాయి అంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus