Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌… కొత్త ఆలోచనలు రావడం లేదా?

బిగ్‌బాస్‌ షోని ఎక్కుమంది ఎందుకు చూస్తారు అంటే అందులో వినోదం అని చెప్పొచ్చు. దీంతోపాటు కొత్త కొత్త టాస్క్‌లు కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే వినోదం సంగతి పక్కనపెడితే… సరైన టాస్క్‌లు ఈ సీజన్‌లో లేవు అని చెప్పొచ్చు. ఈ ఏడు వారాలను ఒకసారి గమనిస్తే… కొత్త రకం టాస్క్‌లు పెద్దగా రావడం లేదు. కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లు కానీ, నామినేషన్‌ స్టైల్‌ కానీ అంతా పాతదే. ముందుగా ఎలిమినేషన్‌ గురించి చూస్తే… ముఖానికి రంగులు పూయడం, సీక్రెట్‌ రూమ్‌లో అడగడం, కాంబినేషన్లో అడగడం, చెట్టుకు కట్టి ఉన్నవి తెంపి వేయడం, హంటర్‌…

ఇవన్నీ గత సీజన్లలో మనం చూసినవే. అయితే ఈసారి పేర్లు, గెటప్‌లు, స్టైల్‌ మారుస్తున్నారు అంతే. దీంతో బిగ్‌బాస్‌కు కొత్త ఆలోచనలు రావడం లేదా అనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ల విషయంలోనూ అంతే. గత నాలుగు సీజన్లలో ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లను రీమిక్స్‌ చేసి ఈ సారి ఇస్తున్నారు. ఒకటి రెండు కొత్తవి కనిపిస్తున్నా… ఎక్కువగా పాతవి రీమిక్స్‌ చేయడం కనిపిస్తోంది. ఈ వారం ఇచ్చిన మిసెస్‌ ప్రభావతి టాస్క్‌ కూడా రీమిక్సే.

గత సీజన్లలో పాలు పితికే టాస్క్‌ పెట్టారు. ఈసారి గుడ్లు పట్టుకునే టాస్క్‌. దీనికి గత సీజన్‌లో ఇచ్చిన కాయిన్స్‌ టాస్క్‌ను మిక్స్‌ చేశారు. గాల్లో గుడ్లు ఎగరేసి వాటిని కూడా పట్టుకోమన్నారు. స్పెషల్‌ కాయిన్‌ లాగా, స్పెషల్‌ ఎగ్‌ పెట్టారు. దీంతో బిగ్‌బాస్‌ రీమిక్స్‌ టాస్క్‌లు పెడుతున్నాడనే చర్చ నడుస్తోంది. టీమ్‌కి కొత్త ఆలోచనలు రాక… పాతవాటిని కలిపికొట్టి ఇస్తున్నారు అని అంటున్నారు. దీంతో చూసేవాళ్లకు బోర్‌ కొడుతోంది అనే మాటలూ వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌.. జర చూసుకోర్రి మరి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus