మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగే ప్రతిసారి వచ్చే నినాదం ‘మా’కు సొంత భవనం. ఎప్పటిలాగే ఈ దఫా ఎన్నికల్లో ఆ నినాదమే కీలకం అవుతోంది. ఇప్పటికే పోటీలో ఉన్నట్లు ప్రకటించిన నటులు ఈ నినాదాన్నే భుజానకెత్తుకున్నారు. అయితే కథలో కీలక మలుపు లాగా… ‘మేం బిల్డింగ్ కడతాం’ అంటూ మంచు విష్ణు ఇటీవల ప్రకటించారు. దీంతో ‘మా’ సినిమా కథలో భారీ మలుపు అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘మా’ భవనం మేమే కట్టిస్తాం అని విష్ణు అనగానే… మిగిలిన నటుల నుండి ఏదో ఒక రకమైన స్పందన రావాలి కదా. ‘మంచి పని విష్ణు’ అనో, లేక ‘ఇప్పుడెందుకు ఈ చర్చ’ అనో ఏదో ఒక కామెంట్ సినిమా పెద్దల నుండి రావాలి. కానీ ఇప్పటివరకు విష్ణు ప్రతిపాదనకు ఎవరూ స్పందించలేదు. పోటీలో ఉన్న ప్రకాశ్‌రాజ్, జీవిత, హేమ ఎలాగూ స్పందించారు. వారికి సపోర్టు చేసేవారూ స్పందించరు. మిగిలినవాళ్లు ఏమయ్యారు.
‘మా’ ఎన్నికల హడావుడి చూసి… ‘ఇప్పుడే ఎందుకు తొందర’ అంటూ కొంతమంది సినిమా పెద్దలు ప్రకాశ్ రాజ్ అండ్ కో మీద ఆగ్రహాలు వ్యక్తం చేశారు. అందుకో, ఇంకెందుకో కానీ ఆయన మళ్లీ ఆ టాపిక్ ఎత్తడం లేదు. కనీసం వాళ్లయినా విష్ణు కామెంట్ మీద స్పందించాల్సింది. ఎవరూ మాట్లాడటం లేదంటే ‘మా’ భవనం మీద విష్ణు ఆలోచన నచ్చలేదా? లేక ఆయన మాటలకు ఎందుకు స్పందించడం అని అనుకున్నారో తెలియడం లేదు.
‘మా’ భవనాన్ని ఒక భవనంలా కాకుండా దానిని ఓ గుర్తింపులా చూస్తున్నారు సినిమా నటులు. ఆ గుర్తింపు లేదా పేరు ఏ ఒక్కరికో దక్కడం ఇష్టముండదు. తరతరాలు నిలిచిపోయే భవనం క్రెడిట్.. ఏ ఒక్కరికో దక్కడం ఇండస్ట్రీలో ఎవరికీ నచ్చడం లేదని కొందరు అంటున్నారు. మరోవైపు మంచు కుటుంబం భవనం నిర్మాణానికే ముందుకొచ్చింది. మరి ప్లేస్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు ఇవ్వాలి అనేది మరో లెక్క. చూద్దాం ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారేమో.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్