Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అని తమ శాయశక్తులా లీకులు ఇస్తూనే ఉన్నారు. ఒకే ప్రదేశంలో వేర్వేరుగా ఫొటోలు దిగి, వేర్వేరుగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేసేవారు. ముంబయి వెళ్లినప్పుడు ఒకే రెస్టరెంట్‌కి వెళ్లడం లాంటివి మనం చాలానే చూశాం. అయితే ఎక్కడా తాము రిలేషన్‌లో ఉన్నామని ఇద్దరూ చెప్పలేదు. అలా అని వచ్చిన కామెంట్స్‌ని ఎప్పుడూ కొట్టిపారేయలేదు.

Vijay, Rashmika

అలా తమ రిలేషన్‌ను చెప్పీ చెప్పనట్లుగా ఉంచిన ఇద్దరు ఇప్పుడు నిశ్చితార్థం అయిన విషయాన్ని కూడా చెప్పీ చెప్పనట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. అంటే కొత్త సినిమా గురించి సమాచారం ఇచ్చినట్లుగా తమ పీఆర్‌ టీమ్‌తో విషయం బయటకు లీకు చేశారు. శుక్రవారం ఏ రాత్రికైనా వాళ్ల నిశ్చితార్థం గురించి ఇద్దరి నుండి పోస్టులు వస్తాయేమో అని అనుకున్నారంతా. కానీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయి ఇంచుమించు ఒక రోజు అయిపోయినా ఎలాంటి సమాచారం లేదు. దీంతో వాళ్లకు ఏమన్నా ఓటీటీ ఆలోచనలు ఉన్నాయా అనే డౌట్‌ మొదలైంది.

సినిమా హీరోలు, హీరోయిన్లకు ఓ అలవాటు ఇటీవల అవుతోంది. తమ పెళ్లిని ప్రైవేటుగా చేసుకొని.. ఆ మొత్తం ఫుటేజీని ఓటీటీకి గంపగుత్తగా అమ్మేస్తున్నారు. దీని కోసం ఎంగేజ్మెంట్‌ నుండి పెళ్లి వరకు ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండదా ఆపేస్తున్నారు. ‘అంతా ఓటీటీలోనే’ అనేది వారి కాన్సెప్ట్‌. గతంలో హన్షిక, నయనతార లాంటివాళ్లు ఇలాంటి పని చేశారు. ఇప్పుడు రష్మిక – విజయ్‌ కూడా ఇలాంటి పనే చేస్తారా అనే డౌట్‌ వస్తోంది. ఈ డౌట్‌ క్లారిటీ అవ్వాలంటే ఆ ఇద్దరి నుండి ఎంగేజ్మెంట్‌ విషయంలో ఓ పోస్టు రావాలి.

పోనీ ప్రచారం వద్దు అనుకునే రకం విజయ్‌ దేవరకొండ కాదు. తన సినిమా విషయంలో, తన బిజినెస్‌ విషయంలో, వ్యక్తిగత విషయాల విషయంలో ప్రచారం బాగానే చేస్తారు. మరి ఎంగేజ్మెంట్‌ని ఎందుకు ఇలా లో ప్రొఫైల్‌గా చేశారు అనేది తెలియాల్సి ఉంది. చూద్దాం ఏ సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశారో?

OG Movie: పవన్ ‘ఫ్యాన్ వార్స్ వద్దని’ చెప్పినా.. నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ తో రెచ్చగొడుతున్నారు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus