ఎవరు చెవితే ఏంటి..చీపురు పట్టేది లేదన్నారు..!

సోషల్ మీడియా యుగంలో రోజుకో కొత్త ఛాలెంజ్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతూ ఉంటుంది. ఇక సెలెబ్రిటీలు కూడా వాటిని ఫాలో అవడంతో వీటికి జనాల్లో మరింత క్రేజ్ వచ్చి చేరుతుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, కికి ఛాలెంజ్ లు వరల్డ్ వైడ్ గా ఓ ఊపు ఊపాయి. కాగా టాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం రియల్ మెన్ ఛాలెంజ్ అంటూ ఒకటి పుట్టుకొచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం ఇంటిలో ఉన్న ఆడవాళ్లకు వంట వార్పు, హౌస్ కీపింగ్ లో సాయపడడం.

సందీప్ రెడ్డి ఈ ఛాలెంజ్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాజమౌళికి ఇవ్వడంతో అది సూపర్ ఫేమస్ అయ్యింది. ఆయన ఎన్టీఆర్, తారక్ లను నామినేట్ చేయగా వారిద్దరిలో ఎన్టీఆర్ ఈ టాస్క్ పూర్తి చేయడమే కాకుండా సీనియర్ స్టార్ హీరోలు రంగంలోకి దింపాలని చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లను ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేశారు. చిరు, వెంకీ దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి చేసి మరి కొందరు స్టార్స్ ని నామినేట్ చేయడం జరిగింది.

ఐతే రెండు దశల్లో దూసుకెళ్లిన ఈ రియల్ మెన్ ఛాలెంజ్ మూడో దశలో చతికిలబడింది. దానికి కారణం టాప్ స్టార్స్ కొందరు ఈ ఛాలెంజ్ పట్ల ఆసక్తి చూపించలేదు. మరి చిరు, ఎన్టీఆర్, వెంకీ వంటి స్టార్స్ కి కూడా హ్యాండిచ్చిన ఆ టాప్ స్టార్స్ ఎవరో చూద్దాం

చిరుని అసలు పట్టించుకోలేదు

మెగాస్టార్ చిరంజీవి అంత పెద్ద స్టార్ అయినప్పటికీ తన కంటే చిన్న వాడైనా ఎన్టీఆర్ ఛాలెంజ్ కి నామినేట్ చేయడంతో ఆ ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఐతే చిరు తన మిత్రుడు సౌత్ ఇండియా స్టార్ రజిని కాంత్ ని నామినేట్ చేయగా.కనీసం స్పందన కరువైంది. రజని కనుక ఈ ఛాలెంజ్ పూర్తి చేసి ఉంటే అది తమిళ పరిశ్రమ మొత్తం పాకేది.

ఎన్టీఆర్ కి హ్యాండిచ్చిన నాగ్, బాలయ్య

జూనియర్ ఎన్టీఆర్ ప్రేమగా బాబాయ్ నాగార్జున, బాలయ్యలను నామినేట్ చేయగా వారు ఎన్టీఆర్ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు. బాలయ్యకు అసలు ట్విట్టర్ అకౌంట్ లేదు, నాగ్ కి మెస్సేజ్ చేరినా స్పందన లేదు. ఎన్టీఆర్ ఛాలెంజ్ ని వీరు పట్టించుకోకుండా ఆయనకు హ్యాండిచ్చారు.

మహేష్ వెంకీ మాట వినలేదు

ఏదో అన్నదమ్ములుగా నటించామనే చనువుతో వెంకటేష్ హీరో మహేష్ ని రియల్ మెన్ ఛాలెంజ్ కి నామినేట్ చేయడం జరిగింది. మా చిన్నోడిని ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేస్తున్నాను అని వెంకీ ట్విట్టర్ లో ప్రేమగా సందేశం పంపారు. ఐతే పెద్దోడి మాట చిన్నోడు పెడ చెవిన పెట్టాడు. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోవడంతో మహేష్ చీపురు పట్టే సూచనలు కనిపించడం లేదు.

బాహుబలి నిర్మాతకు ప్రభాస్ ఝలక్

ఇక మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రియల్ మెన్ ఛాలెంజ్ కి నామినేట్ చేయడం జరిగింది. మరి కత్తి పట్టిన చేత్తో అంట్లు తోమితే ఏమి బాగుంది అనుకున్నాడేమో సారీ చెప్పేశాడు. దానికి తోడు మన ప్రభాస్ బ్యాచ్లర్ కావడంతో ఈ పనులు నావల్ల కావని లైట్ తీసుకున్నాడు.

రవితేజ ఆ రేంజ్ పనులు చేయన్నాడు

దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ మహారాజ్ రవితేజను నామినేట్ చేయగా ఆయన కూడా ఈ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు. ఈ రాజా ది గ్రేట్ అలాంటి పనులకు నేను సూట్ కానని కామ్ గా ఉండిపోయారు.

ఇక కోబ్రా వరుణ్ కూడా వెంకీకి నిరాశే మిగిల్చాడు.

ఎఫ్2 లో తన తోడల్లుడిగా బాధలుపడ్డ వరుణ్ తేజ్ ని వెంకటేష్ నామినేట్ చేయగా ఆయన కూడా వెంకీ ఛాలెంజ్ ని పట్టించుకోలేదు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus