ఆ షోల టాక్‌ తర్వాత నిలబడటం లేదు.. ఏం తేడా జరుగుతోంది?

విడుదలకు వారం ముందు, రెండు వారాల ముందు ఓ సినిమాను కొంతమంది ప్రేక్షకులకు చూపిస్తుంటారు. గతంలో ఎప్పుడో క్లోజ్డ్‌ రూమ్స్‌లో సన్నిహితులకు సినిమా చూపించేవారు. అయితే ఇప్పుడు టికెట్లు అమ్మి మరీ జనాలకు సినిమాలు చూపిస్తున్నారు. వాటినికి ముద్దుగా ‘పెయిడ్‌ ప్రీమియర్లు’ అని పేరు కూడా పెట్టారు. ఇలా సినిమా వేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి అని అంటుంటారు కూడా. ఇప్పుడు ఆ ప్రీమియర్ల గురించి ఎందుకు డిస్కషన్‌ అనుకుంటున్నారా? ఉందీ కారణం ఉంది.

టాలీవుడ్‌లో ఇటీవల ఈ పెయిడ్‌ ప్రీమియర్ల హడావుడి కాస్త ఎక్కువైంది. అప్పుడప్పుడు, ఎప్పుడో ఓ సారి అనేలా ఉన్న ఈ పెయిడ్‌ ప్రీమియర్ల ట్రెండ్‌ను ఇప్పుడు ఎక్కువగా వాడేస్తున్నారు. దీంతో గతంలో వచ్చిన స్పందనలు ఇప్పుడు రావడం లేదు. వచ్చిన ఆ కొన్ని స్పందనల విషయంలో కూడా రియాలిటీ కనిపించడం లేదు. ప్రీమియర్లకు వచ్చిన టాక్‌కి దగ్గరగా ఒరిజినల్‌ రిలీజ్‌ టాక్‌ ఉండటం లేదు. టాలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్స్‌లో పెయిడ్‌ ప్రీమియర్లు వేసిన సినిమాలు అంటే…

అడివి శేష్‌ ‘మేజర్’, రిషభ్‌ శెట్టి ‘చార్లీ 777’, దిల్‌ రాజు – వేణు ‘బలగం’, శ్రీవిష్ణు – రెబా మోనికా జాన్‌ ‘సామజవరమన’, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్‌ ఆనంద్‌ల ‘బేబీ’ (Baby)లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక్కడో విషయం ఏంటంటే ఈ సినిమాల ప్రీమియర్‌ టాక్‌, ఒరిజినల్‌ టాక్‌ ఒక్కటే. దీంతో ఆ తర్వాత నిర్మాతలు ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో నవీన్‌ చంద్ర – కలర్స్‌ స్వాతి ‘మంత్ అఫ్ మధు’..

శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ‘800’, వివేక్‌ అగ్నిహోత్రి ‘వ్యాక్సిన్ వార్’ సినిమాకు అయితే అమెరికాలో నెల రోజుల ముందే షోలు వేశారు. ఇవి కాకుండా చిన్న సినిమాలు ‘ఇంటింటి రామాయణం’, ‘రామన్న యూత్’, ‘హిడింబ’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘ఉస్తాద్’, ‘రంగబలి’ సినిమాలు ఇలానే షోస్‌ వేశాయి. ఆ సినిమాలన్నీ అసలు షోస్‌ దగ్గరకు వచ్చేసిరికి ‘పెయిడ్‌’ టాక్‌ను తెచ్చుకోలేక చతికిలపడ్డాయి. దీంతో ‘పెయిడ్‌’ ప్రీమియర్‌ల టాక్‌లను జనాలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ విషయంలో టాలీవుడ్‌ ఆలోచన మారాలి అనే వాదన మొదలైంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus