సౌత్ ‘క్వీన్’ లకు మోక్షం ఎప్పుడో..!

లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. విడుదలకు సిద్ధపడ్డ ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. ఇదే టైములో ఓటిటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎప్పుడో మూలాన పడిపోయిన సినిమాలను సైతం విడుదల చేసి.. ఎంతో కొంత క్యాష్ చేసుకునే అవకాశం నిర్మాతలకు లభించింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘భానుమతి రామకృష్ణ’ ‘పెంగ్విన్’ వంటి చిత్రాలు డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలయ్యి మంచి ఫలితాలనే అందుకున్నాయి. 3 ఏళ్ళ క్రితం ఆగిపోయిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’.. అలాగే 7 ఎల్లా క్రితం ఆగిపోయిన సందీప్ కిషన్ ‘డికె బోస్’ వంటి చిత్రాలను కూడా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేసి కొంతైనా క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ‘క్వీన్’ రీమేక్ ల విషయంలో మాత్రం ఇలాంటి ప్రయత్నాలు ఏమీ మొదలు కాలేదు.

బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్వీన్’ చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సౌత్ లో కూడా రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడంలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్.. వంటి క్రేజీ హీరోయిన్లతో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. టీజర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే కారణాలేంటో తెలీదు.. ఈ రీమేక్ లు విడుదల కాలేదు.

ఈ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన తమన్నా, కాజల్ వంటి వారు ఏదైనా ఈవెంట్ లకు హాజరైనప్పుడు.. మీడియావారు ‘క్వీన్’ రీమేక్ రిలీజ్ గురించి ప్రశ్నిస్తే.. వాళ్ళు మాత్రం రిప్లై ఇవ్వడం లేదు. లాక్ డౌన్ టైములో కూడా ‘క్వీన్’ రీమేక్ లు కనీసం ఓటిటిలో అయినా విడుదల చెయ్యకపోతే.. వీటి పై ఉండే క్రేజ్ కూడా తగ్గిపోయి.. తరువాత మరిచిపోయే ప్రమాదం కూడా ఉంది.ఇప్పుడు విడుదల చేస్తే ఎక్కువమంది చూసి.. అలా అయినా నిర్మాతలు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నిర్మాతలు దృష్టిలో ఏముందో?

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus