మొన్నీమధ్య చిరంజీవి గురించి ఓ నటుడు మాట్లాడినప్పుడు మామూలుగా చాలామందికి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు… కానీ ఆ ఆయనకు స్టార్లే ఫ్యాన్స్‌గా ఉంటారు అని అన్నారు. అయితే మన దేశ సినిమా పరిశ్రమలో ఇలాంటి ఇమేజ్ ఉన్న హీరోల లిస్ట్ రాస్తే.. మరికొంతమంది ఉంటారు. అలాంటి వారిలో రజనీకాంత్ ఒకరు. ఆయన సినిమా అనుభవం ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి ఉంది. ఇక ఫ్యాన్స్ సంగతి అంటారా? అసోసియేసన్ల గుర్తింపు ఆపేశారు కానీ.. ఏ లక్షలకు వెళ్లిపోయేది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అలాంటి రజనీకాంత్ ఓ సీఎం కాళ్లకు నమస్కరించడం చూసి కొంతమంది ఇబ్బందిపడుతుంటమే.
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందు పరిశ్రమ బాగు కోసం చిరంజీవి చేతులు కట్టుకుని వేడుకుంటే.. అదేదో తప్పయిపోయినట్లు పెద్ద ఎత్తున దుమారం రేపేశారు. పరిశ్రమ కోసం ఆయన ఆ పని చేస్తే.. తన సొంతపని కోసం చేశారేమో అనేలా మాటలు అనేశారు. అసలు విషయం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి అది అక్కడతో ఆగిపోయింది. కానీ ఇప్పుడు రజనీకాంత్ చూస్తే ఎందుకిలా చేశారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎవరెస్ట్ శిఖరంలా రజనీని చూసుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇలా రజనీ ఓ సీఎం కాళ్లు మొక్కడం వారికి నచ్చడం లేదు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జైలర్’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో రజనీ దేవాలయాల సందర్శనకు వెళ్తున్నారు. అక్కడ ఆశీర్వాదాలు పొందుతున్నారు. అయితే ఈ క్రమంలో రజనీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ యోగిని కలిశారు. ఆయనతో కలసి ‘జైలర్’ సినిమా చూశారు. ఇదంతా ఓకే. సీఎం యోగి ఎందుకు చూశారు, ఏం అర్థమైంది అనేది పక్కన పెడితే.. ఆయనను కలిసినప్పుడు గౌరవం రెండు చేతులు ఎత్తి నమస్కరించడమో, షేక్ హ్యాండ్ ఇవ్వడమో కాకుండా.. ఈ పాదాలకు నమస్కారం ఎందుకు అనేదే ప్రశ్న.
అయితే ఇక్కడ ఓ విషయం మనం గుర్తుంచుకోవాలి. రజనీకాంత్ వయసు 72 ఏళ్లు అయితే.. సీఎం యోగి వయసు 51 ఏళ్లు. ఇప్పుడు ఇది ట్రోల్స్‌కి మరో కారణం. వయసులో పెద్దవారు రజనీ నమస్కారం చేశారు అనుకోవడానికి కూడా వీల్లేదు. అసలే బీజేపీ అంటే నచ్చని వాళ్లు ఏకంగా ‘రజనీ తమ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేశారు. అక్కడ కాళ్లకు నమస్కరించారు’ అంటూ విమర్శిస్తున్నారు.
అయితే సీఎం యోగి ఒక సన్యాసి అని, రజనీ అలా చేయడంలో తప్పులేదని కొంతమంది వాదిస్తున్నారు. ఆథ్యాత్మిక కోణంలో రజనీ అలా చేశారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రజనీకాంత్ బీజేపీ సపోర్టు చేస్తున్నారని అందుకే ఇలా చేశారనే మరక అయితే పడిపోయింది. గతంలో కాస్త ఉన్న ఆ మరక.. ఇప్పుడు బలంగా పడిపోయింది. ఇదే కొనసాగితే రజనీకి త్వరలో రాజ్యసభ పక్కా అంటున్నారు. మరి ఈ విషయంలో ‘అర్థమైందా రాజా’ అంటూ రజనీ ఏమైనా తర్వాత స్పందిస్తారేమో చూడాలి.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?