RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్లానింగ్‌ లెక్క తప్పిందా..!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటే పాన్‌ ఇండియా సినిమా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని పుట్టుక ఎక్కడ అంటే తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పకతప్పదు. అయితే పుట్టిన ప్రాంతంలో సినిమాకు ప్రచారం చేయరా? ఇదే ప్రశ్న గత కొద్ది రోజుల నుండి సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. కారణమేంటంటే… సినిమా కోసం ఇప్పటి వరకు టాలీవుడ్‌లో జరిగింది మూడు ప్రెస్‌ మీట్లే. అది కూడా సినిమా ప్రారంభమైన కొత్తలో ఒకటి, ఇటీవల కాలంలో రెండు మాత్రమే.

నిజానికి ఈ సినిమాకు ప్రచారం అక్కర్లేదు అని అంటూ ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీమ్‌ను వెనకేసుకు రావొచ్చు. అయితే ప్రచారం వద్దు అంటే ఎక్కడా అవసరం లేదు. బాలీవుడ్‌కి వెళ్లి తెగ ప్రచారం చేసింది రాజమౌళి అండ్‌ టీమ్‌. యూట్యూబ్‌ ఛానళ్లకు, జొమాటో లాంటి ఫుడ్‌ ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలకు వెళ్లి కూడా ప్రచారం చేశారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు తెలుగులో ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. పోనీ ఆఖరి రెండు, మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు, ప్రచారం సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

ఒమిక్రాన్‌ ప్రభావంతో బహిరంగ కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నాయి. జనవరి 3 వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు. దీంతో గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అనుకుంది అన్నట్లు వార్తలొచ్చిన హైదరాబాద్‌, తిరుపతి ఈవెంట్లు 4,5 తేదీల్లో నిర్వహించాలి. ఆ తర్వాత సినిమాకు ఒక రోజే సమయం ఉంటుంది. మరి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇస్తారు అనేది ప్రశ్న. దీనికి రాజమౌళి టీమ్‌ దగ్గర కూడా సరైన సమాధానం లేదనే తెలుస్తోంది. ఒమిక్రాన్‌ వల్ల వాళ్ల లెక్కలన్నీ మారిపోయాయట.

కొత్త సంవత్సరంలో తొలి ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరు పెంచుదామనుకున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి పెద్దలు చెప్పారు. దానిని ఇక్కడ ప్రచారం విషయంలో ముందు ఇంట ప్రచారం చేసి… హైప్‌ తెచ్చుకొని తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్లాలి. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తెలుగు రాష్ట్రాల ప్రచారం సెకండ్‌ ప్రియారిటీ అయిపోయినట్లుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus