ట్విటర్‌ని సెలబ్రిటీలు వాడేంతగా ఇంకెవరూ వాడరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలన్నా, సానుభూతి తెలియజేయాలన్నా, తమ సినిమా ప్రచారం చేసుకోవాలన్నా, గాసిప్స్ మీద రియాక్ట్ అవ్వాలన్నా.. అన్నింటికీ ట్విటర్‌నే వాడేస్తున్నారు మన సినిమా జనాలు. దీనికి రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఏ మాత్రం అతీతులు కాదు. చాలా రోజులుగా ఇదే పని చేస్తున్నారు. కానీ ప్రముఖ రచయిత, కాబోయే రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌కు విషెష్ చేయడానికి వీళ్లకి టైమ్ లేదా?
రాష్ట్రపతి కోటాలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం దక్షిణాది నుండి నలుగురిని ఎంపిక చేసింది. అందులో సినిమా పరిశ్రమ నుండి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఉన్నారనే విషయం మీకు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్లు కూడా చేశారు. ఈ ట్వీట్లు వచ్చిన కాసేపటికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో విజయేంద్ర ప్రసాద్‌ను కంగ్రాట్యులేట్ చేస్తూ ఓ ట్వీట్ పడింది. ఆ తర్వాత చిరంజీవి నుండి మరో ట్వీట్ పడింది. చిరంజీవి ఇలాంటి గౌరవాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు.
అయితే ఇక్కడ ప్రశ్నల్లా… తారక్, రామ్‌చరణ్ ఇప్పటివరకు ట్వీట్ చేయకపోవడం ఏంటి. ఫోన్ చేసి విషెస్ చెప్పుంటారు అని అనొచ్చు. ఆ విషయం ఫ్యాన్స్‌కి తెలియదు కదా. చిన్న చిన్న విషయాల్ని సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు చెప్పే తారక్, చరణ్ ఈ విషయంలో ఎందుకు సోషల్ మీడియాలో చెప్పలేదు అని సోషల్ మీడియాలోనే చర్చ జరుగుతోంది. చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్, బెస్ట్ క్యారెక్టర్స్ అయిన కాలభైరవ (మగధీర), రామరాజు (ఆర్‌ఆర్ఆర్) రాసింది విజయేంద్ర ప్రసాదే.
ఇక తారక్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్‌లో హిట్ సినిమాలన్నింటికీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అని చెప్పొచ్చు. ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్ఆర్ఆర్’… ఇలా బెస్ట్ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. అయినప్పటికీ తారక్, చరణ్ నుండి ఎలాంటి ట్వీట్లు లేవు. పోనీ సినిమాలకు రివ్యూలు రాసే మహేష్‌బాబు అయినా ట్వీట్ చేశాడా అంటే లేదనే చెప్పాలి. తన తర్వాతి సినిమాకు కథ రాస్తోంది విజయేంద్ర ప్రసాదే కదా. పోనీ చరణ్, తారక్ ట్విటర్‌కు దూరంగా ఉన్నారంటే లేదనే చెప్పాలి. ఆరో తేదీ ఓ ట్వీట్ వేసున్నారు కూడా.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!