నీకొస్తే కోపం, ఇంకొకరికి వస్తే ఒప్పం అంటే అవుతుందా? అస్సలు అవ్వదు కదా? అలా వచ్చే కోపంలో ఏమాట నోటికొస్తే ఆ మాట అనేయొచ్చా? అంటే అస్సలు లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇవే మాటలు సమంతను మనం అడగాలేమో. అదేంటి సమంత ఏమంది, ఎక్కడా మాట్లాడినట్లు లేదు కదా అంటారా? ఆమె అంటే ఒకటి, ఆమె వేసుకున్న చొక్కా మీద రాసి ఉంటే ఇంకొకటా చెప్పండి. మనసులోని భావాలను ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడానికి కొంతమంది ఇలా చొక్కాల మీద, సోషల్ మీడియా పోస్టుల్లో రాసుకుంటూ ఉంటారు. మరి సమంత అలానే చేస్తోందా?
సమాజంలోని అంశాల మీద సమంత స్పందించడం తొలిసారేం కాదు. గతంలో చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో కాస్త గట్టిగానే స్పందించింది. సమాజ సేవ విషయంలోనూ అంతే బలంగా ఉంటుంది. నాగచైతన్యతో వివాహబంధం నుండి విడిపోయాక కొత్త సమంతను చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు. గతంలో ఉన్నంత ఓపిక, సహనం, డీసెన్సీ మిస్ అయ్యాయా? ఆమె కామెంట్లు, స్లోగన్లు, పోస్టులు చూస్తే అదే అనిపిస్తోంది. తాజాగా ఆమె టీషర్ట్ మీద ఉన్న స్టోగనే ఈ డౌట్ తెప్పిస్తోంది. మీరు కూడా ఆ ఫొటో చూసే ఉంటారు. దాని మీదే స్లోగన్ చదివే ఉంటారు. కొత్తగా మేం దాన్ని రాసి చెప్పక్కర్లేదు అనుకుంటా.
డివోర్స్ తర్వాత సమంత సోషల్ మీడియాలో బంధాల గురించి, పిల్లల పెంపకం గురించి, అనుబంధాల గురించి వరుస పోస్టులు పెట్టింది. దానికి అమ్మ చెప్పింది అంటూ ఓ ట్యాగ్‌లైన్ కూడా పెట్టింది. అవి అమ్మ మాటలా? ఈ అమ్మడి మాటలా అనేది పక్కనపెడితే… అందులో సమాజంలో ఎన్నే ఏళ్లుగా ఉన్న విధానాలు, ఆచారాలను, అపోహల్ని ఎత్తి చూపింది. దీంతో చాలామంది సమంతను మెచ్చుకున్నారు. మంచి ప్రశ్న అంటూ లైక్‌లు కొట్టారు. సమంత కూడా కొన్ని రోజులు వాటిని కొనసాగింది.
ఇప్పుడు సమంత ఇంకాస్త డోసు పెంచింది, చొక్కాల మీద స్లోగన్లతో దూకుడు పెంచింది. సోషల్ మీడియాలో ఆమె మీద వస్తున్న వరుస విమర్శలకు వేసారిపోయి సమంత ఇలా స్లోగన్ల దాడి చేస్తోందా? లేక తన చుట్టూ జరుగుతున్న అంశాల గురించి ఇలా చేస్తోందా అనేది తెలియాలి. ఒకటి మాత్రం నిజం. సమంతకు కోపం వచ్చింది. అయితే కోపంలో ఇలా అనొచ్చా అంటే అవునో కాదో ఆమెనే చెప్పాలి.
1
2
3
4
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!