కోలీవుడ్‌ ఇంకెన్నాళ్లీ తమిళ పేర్లు… గట్టి కౌంటర్‌ ఇవ్వాల్సిందేనా?

  • October 10, 2023 / 12:22 PM IST

తెలుగు సినిమా, తమిళ సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చూడాలి. అన్నీ సౌత్‌ సినిమాలే, అన్నీ మన భారతీయ సినిమాలే అంటూ మనం ఓవైపు కలుపుకుంటూ వెళ్తున్నాం. అందుకు తగ్గట్టే కొన్ని సినిమాలు మన దగ్గర విడుదలై భారీ విజయాలు అందుకుంటున్నాయి. హీరోలకు ఇమేజ్‌ పెరుగుతోంది, నిర్మాతలకు డబ్బు వస్తోంది. కానీ తమిళ సినిమా జనాలు ఓ విషయంలో మాత్రం ఇంకా ఆలోచనలు మార్చుకోవడం లేదా? అవుననే అనిపిస్తోంది వాళ్ల సినిమా టైటిల్స్‌ చూసి.

శివ కార్తికేయన్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది తెలుసుగా? ‘అయాలన్‌’ అనేది దాని పేరు. ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రచారం కూడా షురూ చేశారు. దాంతోనే ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ చర్చ మొదలైంది. అదే సినిమా టైటిల్‌. ‘అయాలన్‌’ అంటూ తమిళంలో పెట్టుకున్న పేరును తెలుగు అక్షరాల్లో పెట్టేసి పోస్టర్లు, ప్రచార చిత్రాలు విడుదల చేశారు. దీంతో తెలుగులో ఆ పదానికి అర్థం లేదా? లేక ఒకే అర్థమా అంటూ వెతకడం మొదలుపెట్టారు.

‘అయాలన్‌’ అంటే ఇంగ్లిష్‌లో నెయిబర్‌. అంటే మనం తెలుగులో పొరుగింటివాడు, పక్కింటివాడు అనే పేర్లు పెట్టుకోవచ్చు. లేదంటే యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా కాకుండా వేరే పేరు అయినా వాడుకోవచ్చు. కానీ ‘అయాలన్‌’ టీమ్‌ అలా ఆలోచించలేదు. సేమ్‌ నేమ్‌తో రిలీజ్‌ చేసేద్దాం అంటూ ప్రచారం షురూ చేసేశారు. అలా అని ఇది తొలిసారేం కాదు. గతంలో కూడా ఇలానే తెలుగు అక్షరాల్లో తమిళ పదాలతో టైటిల్స్‌ పెట్టేశారు.

అజిత్ ‘వలిమై’, కంగనా రనౌత్ ‘తలైవి’, విజయ్‌ ఆంటోనీ ‘రత్తం’… ఇలా వరుస (Movies) సినిమాలు తమిళ పేర్లతోనే వచ్చేశాయి. పోనీ అదే పేరుతో పెట్టి ప్రచారం అయినా మన దగ్గర చేస్తారా అంటే… కొంతమంది హీరోలు తెలుగు రాష్ట్రాల ముఖం కూడా చూడరు. ఆఖరికి దిల్‌ రాజు సైతం విజయ్‌ను కనీసం హైదరాబాద్‌ తీసుకురాలేకపోయారు. అయితే ఈ సమస్య లేకుండా కొంతమంది పేర్లను ఇంగ్లిష్‌లోనే పెట్టేస్తున్నారు. అప్పుడు బాధ ఉండదని వారి ఆలోచన అని టాక్‌.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus