Shankar: ‘ఇండియన్‌ 2’ కాదు.. ‘ఇండియన్‌ 3’ కూడా తీశారట… శంకర్‌ ఎందుకిలా చేశారో?

ఒక సినిమా పెద్దది, మరో సినిమా చిన్నది… ఆ హీరో గొప్ప, ఈ హీరో కాదు అని లెక్కలు వేయడం ఎవరి ఉద్దేశమూ కాదు. అయితే ఒక హీరో కోసం మరో హీరో సినిమాను లైట్‌ తీసుకుంటే మాత్రం ఆ హీరో ఫ్యాన్స్‌కి కోపం వచ్చేస్తుంది. ఆ ఆగ్రహాన్ని సోషల్‌ మీడియా వేదికగా చూపించేస్తుంటారు కూడా. ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు రామ్‌చరణ్‌ (Ram Charan) అభిమానులు. దీనికి కారణం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ఆలస్యం. దీనికి కారణం ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar)  ప్లానింగ్‌ అని అంటున్నారు.

ఏమైందా అని చూస్తే… ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను దిల్‌ రాజు (Dil Raju)   తన బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మక 50వ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రారంభించిన తొలి రోజుల్లో చాలా వేగంగా షూటింగ్‌ జరిగింది. అయితే కమల్ హాసన్‌ (Kamal Haasan)  ‘విక్రమ్‌’ (Vikram)  సినిమా రావడం, విజయం సాధించడంతో పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఆగిపోయిన ఆయన సినిమా ‘ఇండియన్‌ 2’ను (Indian2)  రీస్టార్ట్‌ చేయాలనుకున్నారు. గతంలో జరిగిన విషయాలను పక్కనపెట్టి కొత్తగా మొదలుపెట్టి సినిమా పూర్తి చేస్తారు అని వార్తలొచ్చాయి.

అనుకున్నట్లుగా సినిమా మొదలైంది. పారలల్‌గా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ ఉంటుంది అని చెప్పినా అది అవ్వలేదు. పోనీలే వరుస షూటింగ్‌లు, పాత సినిమా, ఏవేవో లెక్కలు అంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ‘ఇండియన్‌ 2’ మాత్రమే కాదు ‘ఇండియన్‌ 3’ షూటింగ్‌ కూడా అయిపోయింది అని కమల్ హాసన్‌ చెప్పారు. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ను పక్కనపెట్టి ‘ఇండియన్‌ 3’ ఎలా పూర్తి చేసేస్తారు.

ఈ సినిమా అయ్యాక ఆ సినిమా చేయొచ్చు కదా అనే చర్చ జరుగుతోంది. శంకర్‌ అసలు ఇలా ఎందుకు చేశారు. హీరో, నిర్మాత ఈ విషయంలో ఎందుకు ఊరుకున్నారు అని కొందరు అంటుంటే.. మరికొందరేమో ఆ విషయాలు టీమ్‌తో మాట్లాడే శంకర్ అలా చేసి ఉండొచ్చు అని డిస్కషన్‌ పెడుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఎవరిస్తారో చూడాలి.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus