మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. అప్పుడే 3 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి అని సమాచారం. అయితే రాజమౌళి పలు ప్రాజెక్టు ఆరంభంలో మహేష్ తో నెక్స్ట్ సినిమా అని చెప్పడం తప్ప.. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిందే లేదు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 6 నెలలు దాటినా ఇంకా అధికారిక ప్రకటన ఇచ్చింది లేదు.
గతంలో ప్రాజెక్టు మొదలయ్యే ముందే ఓ ప్రెస్ మీట్ పెట్టి.. కథ కథనాల గురించి ఓ క్లారిటీ ఇచ్చేస్తాడు రాజమౌళి. కానీ మహేష్ బాబుతో సినిమా మొదలై ఇన్నాళ్లు అవుతున్నా.. కనీసం అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది లేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. అసలు ఈ సినిమాకు పీఆర్ కూడా లేనట్టు చెబుతున్నారు. ప్రమోషన్స్ కోసం ఓ హాలీవుడ్ టీం పనిచేస్తుందట. వాళ్ళ సలహాలు సూచనల మేరకే టీం అంతా పనిచేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
కనీసం ఈ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా ఎక్కడా ఓపెన్ అవ్వడం లేదు. అన్నీ ఎలా ఉన్నా.. రాజమౌళి ఈ మధ్య కాలంలో చాలా సినిమా వేడుకలకు హాజరయ్యారు. అక్కడికి వచ్చిన అభిమానులు మహేష్ సినిమా కోసం అప్డేట్ అడుగుతూ అరుస్తున్నారు. కానీ రాజమౌళి రియాక్ట్ అవ్వడం లేదు. నిన్న ‘జూనియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు రాజమౌళి. కచ్చితంగా స్పీచ్ లో మహేష్ సినిమా కోసం అప్డేట్ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు.
కానీ తన స్నేహితుడు సాయి కొర్రపాటి గురించి ‘జూనియర్’ సినిమా గురించి మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోయాడు. మహేష్ సినిమా గురించి జనాలు అరిచినా చిన్న నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు తప్ప ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం హోస్ట్ సుమ కూడా రాజమౌళిని అప్డేట్ అడగడానికి ఆలోచించింది. గతంలో ‘దేవర’ అప్డేట్ కోసం స్టేజి మీదే ఎన్టీఆర్ ను నిలదీసిన సుమ.. ఇప్పుడు రాజమౌళి వద్ద మాత్రం ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేసింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.