Suresh Babu: చంద్రబాబు అరెస్టు విషయంలో సురేశ్‌ బాబు సైలెన్స్‌… ఎందుకని?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌ ప్రముఖులు, కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే స్పందిస్తారేమో అని అనుకుంటే.. కాస్త టైమ్‌ తీసుకొని పరిస్థితిని అర్థం చేసుకుని టాలీవుడ్‌లో ప్రముఖుల రియాక్షన్‌ వస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సినిమా పెద్దలు మీడియా ముందుకు వస్తుంటే ‘చంద్రబాబు అరెస్టు జరిగిన విధానంపై మీరేమంటారు?’ అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, థియేటర్ల అధినేత అయిన సురేశ్‌ బాబు కూడా ఈ ప్రశ్న ఎదురైంది.

‘సప్త సాగరాలు దాటి సైడ్‌ ఏ’ అనే సినిమాను డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు ‘చంద్రబాబు అరెస్టు’ టాపిక్‌ చర్చకు వచ్చింది. చంద్రబాబు అరెస్టుపై మీ స్పందన చెప్పండి అని అడిగితే… ఆయన ఏదేదో మాట్లాడేసి ఆఖరులో సినిమా గురించి ప్రెస్‌ మీట్‌ పెడితే రాజకీయ ప్రశ్నలు ఏంటి అని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు… ఏ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చేది లేదని సురేష్ బాబు అన్నారు.

ఏపీలో రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలుసని, అందరూ చూస్తున్నారని చెప్పబోయారు. కానీ అక్కడ ఉన్న మీడియా జనాలు ఈ విషయంలో మరీ మరీ దట్టించి ప్రశ్నలు అడిగారు. ఫైనల్‌గా సురేశ్‌బాబు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సురేష్ బాబు కుటుంబానికి చాలా ఏళ్లుగా రాజకీయ నేపథ్యం వుంది. ఆయన తండ్రి దగ్గుబాటి రామానాయుడు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేశారు. ఆ తర్వాత పార్టీకి దగ్గరగా ఉంటూ… చాలా ప్రతిఫలాలే పొందారు అని పరిశ్రమలో ఓ టాక్‌ కూడా ఉంది. స్టూడియోలు, స్థలాలు సంపాదించారు అని కూడా అంటారు.

అలాంటిది ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడకపోవడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే సురేశ్‌బాబు అలా అనడానికి కారణం విశాఖపట్నంలో ఉన్న స్థలాలు, స్టూడియోనే అంటున్నారు. ఆ స్టూడియో విషయంలో ఏపీ ప్రభుత్వంతో కొద్ది రోజుల నుండి చర్చ సాగుతూనే ఉంది. అక్కడ సినిమా పరిశ్రమకు సంబంధించిన పనులు జరగడం లేదు కాబట్టి… తిరిగి ఆ స్థలాలు వెనక్కి తీసుకుంటున్నారనే మాటలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఆ కారణంగానే (Suresh Babu) సురేశ్‌బాబు ‘చంద్రబాబు అరెస్టు’ విషయంలో కామ్‌గా ఉన్నారు అని నెటిజన్లు అంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus