అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లవుతోంది. అయినప్పటికీ పరిచయం చిత్రం మినహా ఇప్పటివరకూ సోలో హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా లేదు. అయితే మధ్యలో సపోర్టింగ్ హీరోయిన్ గా నటించిన ఒక రెండు సినిమాలు ఓ మోస్తరు విజయాలు సాధించాయి. ఆ మాత్రానికి ఆ అమ్మడు అగ్ర కథానాయిక స్థాయిలో బిల్డప్ ఇస్తూ తమ మేనేజర్లను, ఈవెంట్ ఆర్గనైజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది.
అమ్మడు నిన్నమొన్నటివరకూ త్రీ స్టార్ హోటల్ లో ఉండేది. కానీ.. రీసెంట్ గా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించిన ఒక సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ రావడంతో.. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన భామ కంటే ఎక్కువగా ఈ అమ్మడు బిల్డప్ ఇవ్వడం మొదలెట్టింది. తనకు ఫైవ్ కూడా కాదు ఏకంగా సెవెన్ స్టార్ హోటల్లో స్టే కావాలని గోల చేస్తుందట. అమ్మడి బాధ భరించలేక పోన్లే అని సెవెన్ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేయగా.. ఆమె హోటల్ బిల్ కంటే లాండ్రీ, ఫుడ్ బిల్లు ఎక్కువ రావడంతో ఖంగుతిన్నారంట సదరు ఈవెంట్ మేనేజర్స్. చేసేదేమీలేక సచ్చినట్లు ఆ భారీ బిల్ పే చేసి.. నెక్స్ట్ ఈవెంట్ నుంచి ఆమెను మాత్రం పిలవకూడదని డిసైడ్ అయ్యారట. అమ్మడి ఎక్స్ట్రాలు చూస్తుంటే.. ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండేలా మాత్రం కనిపించడం లేదు. ఇకనైనా ఈ సెకలు తగ్గించుకొని మామూలుగా బిహేవ్ చేసే అమ్మడికే మంచిది.