మెహర్ రమేశ్‌తో సినిమా చేస్తున్నా అని చిరంజీవి ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ… అప్పటి నుండి మీమర్స్‌కు, ట్రోలర్స్‌కు పండగ వాతావరణం నెలకొంది. మామూలు సినిమా మొదలవుతుంది అంటేనే ఫొటోషాప్‌లకు, నోళ్లకు పని చెప్పే వీళ్లు… మెహర్ రమేశ్ సినిమా అనేసరికి రెడ్‌బుల్ తాగిన సింహాల్లా రెచ్చిపోయారు. ఈ మధ్య ట్రోలింగ్ కాస్త తగ్గింది అనుకునేలోపు ‘భోళా శంకర్’ అంటూ సినిమా పేరు ప్రకటించారు మెహర్ రమేశ్. దీంతో మళ్లీ ట్రోలింగ్ షురూ అయ్యింది. ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది.
మెహర్ రమేశ్ అంటే మాస్ దర్శకుడు అనే పేరు ఉండేది. ‘ఆంధ్రావాలా’, ‘ఒక్కడు’ సినిమాల్ని కన్నడ పరిశ్రమకు రీమేక్‌గా తీసుకెళ్లి మంచి విజయాలు అందుకున్నాడు. ఎన్టీఆర్‌ను ‘కంత్రి’గా చూపించి మెప్పించాడు. ఆ తర్వాత ప్రభాస్ ‘బిల్లా’తో స్టయిలిష్ మాస్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ‘శక్తి’, ‘షాడో’ లాంటి డిజాస్టర్లు తీసి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ రెండు సినిమాలు దారుణాలే కానీ… అలాంటి ఫ్లాప్‌లు ఇంకెవరూ తీయలేదా అంటే చాలామందే తీశారు అనే మాట వినిపిస్తుంది.
ఇండస్ట్రీలో భారీ హిట్లు ఇచ్చిన దర్శకులు ఫ్లాప్‌లు కూడా ఇచ్చారు. డిజాస్టర్లు కూడా ఇచ్చారు. వారి విషయంలో ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వలేదు. కానీ మెహర్ రమేశ్ విషయంలోనే ఎందుకు అనేది తెలియడం లేదు. ‘శక్తి’లో ఎన్టీఆర్ గెటప్, ‘షాడో’లో వెంకటేశ్ గెటప్‌లే ఈ నెగిటివిటీకి కారణం అని కొందరు అంటున్నారు. ఆ గెటప్‌లు వేసిన వారు, ఆ హీరోల అభిమానులే వాటిని మరచిపోయారు. అయినా దర్శకుడు చెప్పాడు కదా… అని హీరోలు గెటప్‌లు వేసేయరు. అలాంటప్పుడు ఆ సినిమా ఫలితం కేవలం దర్శకుడి మీదే ఎందుకు?
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!