అతి తక్కువ సమయంలోనే ఏ హీరోకి సాధ్యంకాని ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలతో దాదాపు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు అని అనుకున్నారు. కానీ అది తప్పని ప్రూవ్ అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. విజయ్ దేవరకొండ సినిమా హిట్ అయితే ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తున్నాయో.. ఒకవేళ ప్లాప్ టాక్ వస్తే చిన్న హీరోల స్థాయి కలెక్షన్లను కూడా రాబట్టలేకపోతున్నాయి.
ఉదాహరణకి చూసుకుంటే ‘నోటా’ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. కానీ రెండో రోజు నుండీ దారుణంగా పడిపోయింది. ఇక ‘డియర్ కామ్రేడ్’ పరిస్థితి కూడా ఇంచు మించు ఇంతే. ఇక తాజాగా విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం పరిస్థితి ఇంకా దారుణం. కనీసం ‘నోటా’ చిత్రం కొద్దో గొప్పో 10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆ తర్వాత ‘డెఫిసిట్లు’ పడ్డాయి. అంటే థియేటర్ రెంట్లకు కలెక్ట్ చెయ్యకపోవడం అన్న మాట. ‘డియర్ కామ్రేడ్’ 8వ రోజు నుండీ అలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది. కానీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పరిస్థితి మరింత ఘోరం. 4 వ రోజు నుండే డెఫిసిట్లు పడుతున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. కేవలం విజయ్ సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుందో.. తెలీడం లేదు. కనీసం పూరి చిత్రంతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!