టీవీ షోల్లో సంచలనం అంటే ‘జబర్దస్త్’. రాత్రి 9.30 టైమ్‌లో సరైన ఎంటర్‌టైన్మెంట్ షోస్ లేని సమయంలో ఈటీవీలోకి వచ్చిన సుమారు పదేళ్లుగా అదరగొడుతోంది ఈ కార్యక్రమం. ఈటీవీ కోసం మల్లెమాల చేస్తున్న షో ఇది. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ షో గురించి, ఈ షోను రన్ చేస్తున్న మల్లెమాల టీమ్ గురించి తెగ వీడియోలు కనిపిస్తున్నాయి. మల్లెమాల శ్యామ్‌ప్రసాద్ రెడ్డి గురించి, టీమ్ గురించి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తొలుత విమర్శల్లా కనిపించిన ఈ వ్యవహారం ఇప్పడు ఏవగింపుకు దారితీస్తోంది.
‘జబర్దస్త్’ మీద విమర్శలు రావడం, అందులోని వారిపై విమర్శలు రావడం గతంలో చాలాసార్లు జరిగింది. అయితే అప్పుడు వాటిని అనింది బయటివాళ్లు. అయితే ఇప్పుడు చర్చకు కారణం అందులో టీమ్ లీడర్‌గా చేసి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి, ప్రస్తుతం అందులో పని చేస్తున్న వ్యక్తుల మధ్య కావడం. దీంతో గతంలో రానంత అటెన్షన్ ఇప్పటి గొడవ మీద వస్తోంది. బయటికెళ్లిన వ్యక్తి కిర్రాక్ ఆర్పీ అయితే, లోపల ఉన్న వాళ్లు రాంప్రసాద్, హైపర్ ఆది. వీరికి షేకింగ్ శేషు, రాకేశ్ మాస్టర్, అదిరే అభి యాడ్ అయ్యారు.
ఈ తాజా రచ్చ మొదలైంది మాత్రం కిర్రాక్ ఆర్పీతోనే అని చెప్పాలి. ఓ యూట్యూబ్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం జబర్దస్త్ గురించి, షో రన్నర్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల జోలిక వెళ్లడం అంతమంచిది కాదు. ఆ తర్వాత అదే ఛానల్ ఇంటర్వ్యూకి పైన చెప్పిన శేషు, ఆది, రాంప్రసాద్ లాంటి వాళ్లు వచ్చి ఆర్పీ మీద కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో జబర్దస్త్ టీమ్‌ను వెనకేసుకొచ్చారు. అందులో తప్పు కూడా లేదు.
అయితే ఈ మొత్తం వ్యవహారం ఇంతవరకు రావడానికి కారణాలు పక్కనపెడితే ఇలాంటి రచ్చ అవసరమా అనేది టీమ్ ఆలోచించుకోవాలి. గతంలో షో దర్శకులు నితిన్ – భరత్ వెళ్లిపోయినప్పుడు, అంతకుముందు నాగబాబు వెళ్లినప్పుడు కూడా ఇంతగా చర్చ జరగలేదు. ఇప్పుడెందుకు ఇంత రచ్చ చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు అనేది టీమ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంద. లేకపోతే లేని పోని చర్చ.