Bigg Boss: వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవసరమా ? ఎవరు వస్తున్నారంటే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే నిజమే అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు రాబోతున్నారా అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే, కేవలం బాబా భాస్కర్ మాత్రమే కాదు, బాబాభాస్కర్ తో పాటుగా శ్రీముఖి కూడా హౌస్ లోకి వెళ్లబోతోంది. కానీ, శ్రీముఖి వైల్డ్ కార్ట్ ఎంట్రీ మాత్రం కాదట.

Click Here To Watch NOW

బాబా భాస్కర్ – శ్రీముఖి ఇద్దరూ టాస్క్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని, శ్రీముఖి హౌస్ లో నుంచీ వచ్చేస్తుందని , బాబాభాస్కర్ మాత్ర్ం గేమ్ ఆడతారని అంటున్నారు. అయితే, ఇన్ని వారాలు గడిచిన తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఉపయోగం ఉంటుందా అనేది ఇక్కడ పాయింట్. అంతేకాదు, 8వ వారంలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అన్ ఫెయిర్ అవుతుంది. హౌస్ మేట్స్ కూడా దీనిపై అబ్జక్షన్ పెట్టే అవకాశం ఉంటుంది.

అందులోనూ టాప్ 5 ప్లేయర్ అయిన బాబాభాస్కర్ వస్తే గేమ్ మొత్తం మారిపోతుంది. బాబాభాస్కర్ ఖచ్చితంగా నామినేషన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటివరకూ గేమ్ ఆడిన వాళ్లలో ఒకరు బాబాభాస్కర్ సేఫ్ అయినప్పుడల్లా ఎలిమినేట్ అయిపోతారు. ఇది ఖచ్చితంగా అన్ ఫెయిర్ అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఓటీటీలో బిగ్ బాస్ షోకి ఆదరణ లభించడం లేదు. ప్రతి ఒక్కరూ ఐపియల్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రతిరోజూ మ్యాచ్ కి మిలియన్స్ లో వ్యూవర్ షిప్ వస్తోంది.

కానీ, బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకి మాత్రం ఓటీటీలో ఆశించినంత వ్యూవర్ షిప్ రావడం లేదు. అందుకే, ఇప్పుడు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ కోసం బాబాభాస్కర్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించబోతున్నారట. గతంలో ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. నిజానికి ముమైత్ ఖాన్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కూడా మొదటివారమే ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ముమైత్ పుణ్యమా అని స్రవంతి కూడా ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు బాబాభాస్కర్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటారు. దీనివల్ల స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతున్న ఎవరో ఒకరు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఒక్కరే కాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి కూడా ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 3లో వీరిద్దరి మద్యలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ని అందించారు వీళ్లిద్దరూ. ఇప్పుడు ఇదే ఊపులో ఈవారం ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. మరి ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ అందిస్తారు అనేది ఆసక్తికరం. అదీ విషయం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus