బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కొంతమంది పార్టిసిపెంట్స్ రాబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి అక్టోబర్ 8వ తేదిన బిగ్ బాస్ సీజన్ 7ని మరోసారి గ్రాండ్ గా లాంఛ్ చేస్తూ పార్టిసిపెంట్స్ ని మరికొంత మందిని పంపించబోతున్నారు అనేది టాక్. అయితే, దీనిపై ఇప్పటివరకూ ఎక్కడా క్లారిటీ లేదు. కానీ, దసరా సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని చేసి బిగ్ బాస్ ఈసారి సీజన్ ని రీ లాంఛ్ చేసేలా ఎపిసోడ్ ని ప్లాన్ చేయబోతున్నారని చెప్తున్నారు. అయితే, వీళ్లలో ఎవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారో ఒక్కసారి చూసినట్లయితే.,
నెంబర్ 1 – యూట్యూబర్ కాస్కో నిఖిల్
నిఖిల్ కి యూట్యూబ్ లో మంచి ఫేమ్ ఉంది. అంతేకాదు, ఎంతో మంది సెలబ్రిటీలని ఇంటర్య్వూస్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు యూట్యూబర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
నెంబర్ 2 – అంజలీ పవన్
బిగ్ బాస్ సీజన్ – 7లో అంజలీ పవన్ సోలోగా అడుగుపెట్టబోతోందని టాక్. నీతోనే డ్యాన్స్ షోతో అందర్నీ ఆకట్టుకున్న అంజలీ ఆర్టిస్ట్ గా కూడా అందరికీ సుపరిచితమే. గతంలో చిన్న బడ్జెట్ సినిమాలకి హీరోగా చేసిన సంతోష్ పవన్ ని పెళ్లి చేసుకుంది అంజలీ. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ – 7లో ఏం చేయబోతుందనేది చూడాలి.
నెంబర్ – 3 – ఆర్టిస్ట్ అర్జున్ అంబటి
అగ్నిసాక్షి సీరియల్ లో బాగా ఫేమస్ అయ్యాడు అర్జున్. అంతేకాదు, ఆర్టిస్ట్ గా వెండితెరపై కూడా కనిపించి అందర్నీ మెప్పించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా శంకర్ కి మంచి పేరు ఉంది. ముఖ్యంగా దేవత సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. అర్జున్ కూడా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టబోతున్నాడు అనేది టాక్.
నెంబర్ – 4 – ఆర్టిస్ట్ పూజా మూర్తి
గుండమ్మ కథ సీరియల్ కొనసాగింపులో గుండమ్మగా అందరికీ సుపరిచితురాలే. బెంగుళూర్ లో పుట్టిన పూజా మూర్తి ఆ తర్వాత కన్నడ సీరియల్స్ లో యాక్ట్ చేసింది. అక్కడ్నుంచీ తెలుగులో గుండమ్మ కథలో మైయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. ఇప్పుడు మరి బిగ్ బాస్ సీజన్ – 7లో కూడా లాస్ట్ మినిట్ లో పూజూ మూర్తిని తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. మరి ఈ అమ్మడు గేమ్ ఎలా ఆడుతుందనేది చూడాలి.
నెంబర్ – 5 – ఫోక్ సింగర్ భోలే షవాలి
యూట్యూబ్ లో ఫేమస్ సాంగ్స్ పాడుతూ ఫోక్ సింగర్ భోలో షవాలి చాలా పేమస్ అయ్యాడు. రీసంట్ గా కష్టపడ్డా, పాలమ్మా అనే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, ఇప్పటివరకూ చాలా పాటలు తనే రాసి కంపోజ్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు. అన్ని పాటలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. కరోనా సాంగ్, నేను తెలంగాణా పోరడ్ని ఇలాంటి పాటలు బాగా హిట్ అయ్యాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా, పాటల రచయితగా, సింగర్ గా భోలో షవాలి సోషల్ మీడియాలో తన మార్క్ వేశాడు.