Wild Dog: యూట్యూబ్ లో ‘వైల్డ్ డాగ్’ లింక్.. క్లిక్ చేస్తే..!

అక్కినేని నాగార్జున లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం జనాన్ని ఫూల్స్ చేసింది. అసలు విషయంలోకి వస్తే.. ‘వైల్డ్ డాగ్’ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తమ సినిమా మొత్తాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని పేర్కొంటూ సదరు లింక్ ను పోస్ట్ చేసింది. అయితే ఇది చూడొద్దని.. థియేటర్లోనే సినిమా చూడండి అంటూ ట్వీట్ చేశారు.

రిలీజ్ కి ముందు యూట్యూబ్ లో మొత్తం సినిమా వచ్చిందంటే జనాలు సైలెంట్ గా ఉంటారా..? వెంటనే ఆ లింక్ ను క్లిక్ చేసి సినిమా చూసే ప్రయత్నం చేశారు. అలా లింక్ ఓపెన్ చేసిన వాళ్లు షాక్ తిన్నారు. లింక్ ఓపెన్ అయిన వెంటనే సినిమాకు బదులుగా అలీ రెజా, సయామీ ఖేర్ ప్రత్యక్షమై ‘పైరసీ ఆపండి.. వైల్డ్ డాగ్ ను థియేటర్ లో చూడండి’ అంటూ చెబుతూ కనిపించారు.

వీడియో లింక్ నిడివి రెండు గంటలకు పైగా ఉండగా.. మొత్తం కూడా ఇదే మెసేజ్ తో నింపేశారు. దీంతో ఇది ప్రమోషన్ టెక్నీక్ అని అర్ధం చేసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి జనాన్ని ఫూల్స్ చేసి సినిమాని బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దియా మీర్జా హీరోయిన్ గా కనిపించనుంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus