అక్కినేని నాగార్జున హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’. అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్ లు కలిసి నిర్మించారు. ఏప్రిల్2 న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియామీర్జా నటించింది. ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దాంతో సినిమా పై అంచనాలు కూడా పెరిగాయని చెప్పొచ్చు. ఇక ‘వైల్డ్ డాగ్’ చిత్రానికి 18కోట్ల వరకూ బడ్జెట్ అయ్యింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ చిత్రం 10కోట్ల పైనే రాబట్టిందట.
ఇక థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 2.50 cr |
సీడెడ్ | 1.20 cr |
ఉత్తరాంధ్ర | 4.00 cr |
ఏపీ+తెలంగాణ (టోటల్) | 7.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇంఫియా | 0.80 cr |
ఓవర్సీస్ | 0.50 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 9.00 cr |
‘వైల్డ్ డాగ్’ చిత్రానికి 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ పోటీగా కార్తీ ‘సుల్తాన్’ మూవీ ఉంది. అలాగే నెక్స్ట్ వీక్ కు ‘వకీల్ సాబ్’ ల్యాండ్ అవుతున్నాడు. కాబట్టి వీకెండ్ కే టార్గెట్ ఫినిష్ చేస్తే బెటర్. పాజిటివ్ టాక్ వస్తే అదేమీ పెద్ద కష్టం కాదు లెండి.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!