Adipurush: ఆదిపురుష్ మూవీ బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయడం సాధ్యమేనా?

  • June 10, 2023 / 12:45 PM IST

ఆదిపురుష్ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. జూన్ నెల 16వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన చోట ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు భారీ సంఖ్యలో ఆదిపురుష్ టికెట్లను బుకింగ్ చేసుకుంటూ ఉండటంతో ఫ్యాన్ సైతం తెగ సంతోషిస్తున్నారు. అయితే ఆదిపురుష్ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. మరోవైపు ఈ సినిమా బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాహుబలి2 సినిమా అప్పట్లో 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆదిపురుష్ సినిమాకు పోటీగా మరే సినిమా ప్రస్తుతం థియేటర్లలో లేదనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా మైథలాజికల్ సినిమాలకు సంబంధించి కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేశాయి. ఆ సంస్థల భవిష్యత్తు సైతం ఈ సినిమాలపై ఆధారపడి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ (Adipurush) సినిమా సక్సెస్ సాధిస్తే రామాయణం ఆధారంగా మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశం అయితే ఉంది. ఆదిపురుష్ సినిమా భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీ సిరీస్ కొన్ని ఏరియాలలో సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే టీ సిరీస్ సంస్థ మరిన్ని టాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus