Adipurush: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ సంచలనాలు సృష్టించడం ఖాయమేనా?

ప్రభాస్ రాముని పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 50 రోజుల సమయం ఉంది. పాన్ ఇండియా మూవీగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై నెగిటివిటీ అంతకంతకు తగ్గుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ బిట్ విడుదల కాగా ఈ సాంగ్ బిట్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్ అనే లిరిక్స్ తో ఉన్న ఈ సాంగ్ బిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

విడుదలైన తర్వాత ఆదిపురుష్ మూవీ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. యువి సంస్థ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాలి. ప్రభాస్ గత సినిమాలు నిరాశపరిచిన నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఆదిపురుష్ సినిమాకు 600 కోట్ల రూపాయలు ఖర్చైందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. త్వరలో ఆదిపురుష్ నుంచి మరిన్ని సాంగ్స్ రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. జూన్ 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరెషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus