టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మరీ బ్లాక్ బస్టర్ హిట్ ను అయితే సొంతం చేసుకోలేకపోయారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మోస్తరు హిట్ ను అందుకున్న అఖిల్ కు ఏజెంట్ సినిమాతో భారీ షాక్ తగిలింది. ఏజెంట్ సినిమా విడుదలై దాదాపుగా ఏడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. అయితే అఖిల్ తర్వాత మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని
ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సినిమాలో తారక్ కు జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్ అక్కినేని అఖిల్ కు జోడీగా నటించడానికి ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా ప్రయోగాత్మక సినిమా అని అక్కినేని అఖిల్ కోరుకున్న బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో దక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అఖిల్ ధీర అనే పేరుతో ఉన్న జెర్సీని ధరించిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. మేకర్స్ స్పందిస్తే మాత్రమే ఈ సినిమా బడ్జెట్ గురించి, ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అఖిల్ కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రాబోయే రోజుల్లో అఖిల్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. అఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా 2024 సంవత్సరం (Akhil) అఖిల్ కు కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాలి. అఖిల్ కు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.