Alia Bhatt, Jr NTR: కొరటాల శివ ప్లాన్స్‌ బూడిదలో పోసిన పన్నీరేనా..!

ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్‌ అంటూ పుకార్లు మీద పుకార్లు వచ్చాయి.. కానీ ఇంతవరకూ అవ్వలేదు. అలాగే తారక్‌తో ఆలియా భట్‌ అంటూ ఈ మధ్య పుకార్లు వచ్చాయి. ఇది ఇప్పటివరకు అవ్వలేదు. కొరటాల శివ సినిమాతో అయ్యేలా కనిపిస్తోంది అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఇది కూడా కష్టమేనా… ఏమో పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. దీనికి కారణం ఆమె పెళ్లే అని తెలుస్తోంది. ‘గంగూభాయ్‌ కాఠియావాడి’ సినిమా ప్రచారంలో భాగంగా ‘ఏంటీ ఎన్టీఆర్‌తో నటిస్తున్నారట?’ అని ఆలియాను అడిగితే… చర్చలు జరుగుతున్నాయి అని చెప్పింది.

Click Here To Watch NOW

దీంతో ఎన్టీఆర్‌తో ఆలియా పక్కా అంటూ వార్తలొచ్చేశాయి. పాత్ర ఇలా ఉంటుంది అంటూ పుకార్లు కూడా మొదలైపోయాయి. తారక్‌ ఇచ్చిన రీసెంట్ అప్‌డేట్‌ ప్రకారమైతే జూన్‌లో సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. దీంతో ఆ టైమ్‌కి ఆలియా డేట్స్‌ ఖాళీగానే ఉంటాయా అనే ప్రశ్న మొదలైంది. ఇప్పుడే పెళ్లి అవ్వడంతో తారక్‌ డైరీ మొత్తం షఫుల్‌ అయిపోయిందని, కొత్త సినిమాలకు డేట్స్‌ ఇవ్వడం కన్నా.. పాత సినిమాలు పూర్తి చేయడమే ఆమె ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు.

ఈ లెక్కన ఎన్టీఆర్‌ సినిమా ఇప్పట్లో కష్టమే అని చెబుతున్నారు. అయితే ఆమె చేతిలో మూడు సినిమాలే ఉన్నాయి. అందులో ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ ఒకటే షూటింగ్‌ దశలో ఉంది. ‘బ్రహ్మాస్త్ర’, ‘డార్లింగ్స్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. కాబట్టి కొత్త సినిమాకు డేట్స్‌ ఇవ్వడం ఈజీనే. అందులోనూ తారక్‌ సినిమా విషయంలో బయటకు చెప్పకపోయినా.. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా అయిపోయాయని అంటున్నారు. ఆ లెక్కన సినిమాలో ఆమె ఉన్నట్లే అని చెప్పొచ్చు.

అయితే పెళ్లి కుషన్‌ టైమ్‌, హనీమూన్‌ అంటూ ఆమె జూన్‌లో ఎక్కడికైనా వెళ్తే… ఎన్టీఆర్‌ సినిమాకు ఇబ్బందే. ఇప్పటికే ఎన్టీఆర్ నుండి ‘ఆర్ఆర్ఆర్‌’ కాకుండా మరో సినిమా వచ్చి చాలా రోజులైంది. కాబట్టి ఆలియా కోసం అన్ని రోజులు షూటింగ్‌ పెట్టుకుంటారు అని అనుకోలేం. కాబట్టి వేరే హీరోయిన్‌ వైపు ఎన్టీఆర్‌ – కొరటాల వెళ్తారు అని అంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus