Alia Bhatt: అలియా హాలీవుడ్ ప్రాజెక్ట్ కు ప్రెగ్నెన్సీ అడ్డుకానుందా?

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లి కాబోతున్నారనే శుభవార్తను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో పెద్దఎత్తున ఈమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇకపోతే ఈ విషయం తెలిసిన అందరూ ఆలియా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఈమెకు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇక ఈమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో ఆరోగ్యంపై అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కనుక మరి తను కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.అలియా భట్ ఇప్పుడిప్పుడే హాలీవుడ్ అవకాశాలను అందుకుంటుంది ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో ఈమె హాలీవుడ్ సినిమాలకు తన ప్రెగ్నెన్సీ అడ్డుగా మారునుందా అనే సందేహం కలుగుతుంది. తాజాగా ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నారు.

త్వరలోనే తిరిగి ఈ సినిమా షెడ్యూల్లో ఆలియా, పాల్గొనాల్సి ఉంది.ఈ సమయంలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడంతో ఈమె తన ప్రెగ్నెన్సీ తోనే హాలీవుడ్ సినిమా కోసం సాహసం చేస్తారా అనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. అలియా మాత్రం ఈ సినిమా నుంచి వెనక్కితగ్గే ఆలోచనలో ఏ మాత్రం లేదు.

అలియా సన్నిహితుల సమాచారం ప్రకారం ఈమె అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి తిరిగి ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అని తెలియగానే తన ప్రెగ్నెన్సీ కోసం సినిమాలను వదులుకోవడానికి ఇష్టపడతారు అయితే అలియా మాత్రం అందుకు భిన్నంగా ప్రెగ్నెన్సీ తో సాహసం చేయడానికి సిద్ధమయ్యారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus