కొన్ని సార్లు పాటలు బాగా పాపులర్ అవుతాయి. ఎంతగా అంటే ఆ పాట లిరిక్స్ ని టైటిల్ గా పెట్టుకునేంత. అత్తారింటికి దారేది సినిమాలో ‘కాటమరాయుడా అనే పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందరినోట ఆ పాటే పలికింది. అందుకే ఆ పేరునే తన చిత్రానికి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. అలాగే దువ్వాడ జగన్నాథం (డీజే) లోని “సీటీమార్” సాంగ్ ఉర్రూతలూగించింది. ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఈ పాట తప్పనిసరి అవుతోంది. అందుకే ఆ పేరుతో సినిమాని ప్రకటించారు ఆ చిత్ర డైరక్టెర్ హరీష్ శంకర్. కథ ఎలా ఉంటుందో? హీరోగా ఎవరు చేస్తారో అనేది ఖరారు చేయక ముందే ఆ టైటిల్ ప్రకటించడం వెనుక.. ఆ టైటిల్ ని ఎవరూ తీసుకోకూడదని ఉద్దేశం కనబడుతోంది. అయితే టైటిల్ ప్రకటన తరవాత హీరో ఎవరనే చర్చ మొదలయింది.
‘జవాన్’ చిత్రాన్ని నిర్మించిన అరుణాచల్ క్రియేషన్స్ అధినేత కొమ్మలపాటి కృష్ణ ఈ చిత్రాన్నీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. హీరోగా నటించడానికి అల్లు అర్జున్ వస్తారా? రారా? అనేది ఫిలింనగర్ వర్గాల వారిని బుర్రని తొలిచి వేస్తున్న ప్రశ్నగా మారింది. డీజే తర్వాత బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య చేస్తున్నారు. ఇక డైరక్టర్ హరీష్ శంకర్ దాగుడుమూతలు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. దిల్ రాజు బ్యానర్‌లో నిర్మితం కానున్న ఈ చిత్రంలో శర్వానంద్, నితిన్ లు నటించనున్నారు. ఈ మూవీ తర్వాత, కథ రెడీ చేసి బన్నీని ఒప్పిస్తాడా? లేదో ఇప్పుడే చెప్పలేము.