ఇవాళ (డిసంబర్ 2) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) గత రెండు సినిమాలు “అల వైకుంఠపురములో, పుష్ప” (Pushpa) ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా అక్కడే జరిగి ఉండడంతో సెంటిమెంట్ ప్రకారం కూడా ఈ ప్లేస్ సినిమా సక్సెస్ కు దోహదపడుతుందని భావిస్తున్నారు చిత్రబృందం. ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ హాజరుకావడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
అయితే.. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ ఎవరికి థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా జనాలు పెద్దగా పట్టించుకోరు కానీ, పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) థ్యాంక్స్ చెబుతాడా లేదా అనే విషయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. “పుష్ప 2”కి (Pushpa 2: The Rule) ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 500 రూపాయలకు పైగా హైక్ లభించింది. అందుకు కారణంగా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి.
అల్లు అరవింద్ (Allu Aravind) & బన్నీ వాసు (Bunny Vasu) కలిసి ఈ హైక్ వచ్చేలా చూశారు. ఎందుకంటే.. గత ప్రభుత్వ హయాంలో విడుదలైన “పుష్ప” టికెట్ రేట్స్ మరీ 20 రూపాయల లోపు ఉండడం తెలిసిందే. అందువల్ల సినిమా హిట్ అయినా చాలా ఏరియాల్లో ప్రాఫిట్స్ రాలేదు. కొంతమంది నష్టపోయారు కూడా. అటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏకంగా తొలివారం మల్టీప్లెక్స్ లలో 500 రూపాయల టికెట్ రేట్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో 300 రూపాయల హైక్ లభించడం అనేది మామూలు విషయం కాదు.
“పుష్ప 2” సాధించబోయే తొలిరోజు రికార్డ్స్ లో ఈ టికెట్ హైక్ కీలకపాత్ర పోషించనుంది. మరి ఇంత మంచి చేసిన పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పి బన్నీ తన స్థాయిని పెంచుకుంటాడా లేక ఎప్పట్లానే సినిమా గురించి మాట్లాడేసి మెగా మనస్పర్థలు నిజమే అని మరోసారి ప్రూవ్ చేస్తాడా? అనేది చూడాలి. మరి బన్నీ కాకపోయినా పుష్ప బృందం నుండి మరెవరైనా పవన్ కళ్యాణ్ పేరెత్తుతారా అనేది చూడాలి.