Amigos: కళ్యాణ్ రామ్ ఆ రికార్డును సొంతం చేసుకుంటారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా సినిమాకు వైవిధ్యం కోరుకునే హీరోలలో కళ్యాణ్ రామ్ ముందువరసలో ఉంటారు. కళ్యాణ్ రామ్ సినిమాలకు నందమూరి అభిమానుల నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. అయితే కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఇప్పటివరకు 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా అయితే లేదు. అయితే అమిగోస్ ఈ అరుదైన రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బింబిసార మూవీ రికార్డులను అమిగోస్ కచ్చితంగా బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బింబిసార సినిమాకు 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కళ్యాణ్ రామ్ కు సినిమా సినిమాకు మార్కెట్ సైతం పెరుగుతోంది. అమిగోస్ సక్సెస్ సాధిస్తే మాత్రమే కళ్యాణ్ రామ్ రేంజ్ అంతకంతకూ పెరిగే అవకాశం ఉండటం గమనార్హం.

అమిగోస్ అంటే స్నేహితులు అనే అర్థం కాగా సినిమా కంటెంట్ కు టైటిల్ కు ఏ విధంగా రిలేషన్ ఉందో తెలియాల్సి ఉంది. అమిగోస్ సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆషికా రంగనాథ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోతారేమో చూడాల్సి ఉంది. ఎన్నో రాత్రులొస్తాయి కానీ సాంగ్ లో ఆషికా రంగనాథ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమిగోస్ సినిమా కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ను అందించడంతో పాటు నందమూరి హీరోల వరుస విజయాలను కొనసాగిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అమిగోస్ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus